ఆంధ్రప్రదేశ్‌

28 ప్రధాన ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 20: రాష్ట్రంలో 28ప్రధాన ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేయడంతో పాటు రానున్న కాలంలో కుప్పంకు హంద్రీ-నీవా ద్వారా నీటిని తీసుకు రావడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లె వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జూనియర్ కళాశాల వద్ద జరిగిన బహిరంగ సభలో సి ఎం మాట్లాడుతూ నీరు ప్రగతికి చిహ్నమని, నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటే అక్కడ అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పట్టిసీమను పూర్తి చేశామన్నారు. హంద్రీ-నీవాకు 420కోట్లు కేటాయించామన్నారు. రెండు నెలల కాలంలోనే కుప్పంకు సాగునీటిని తెప్పిస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వాటిని శుభ్రం చేసే బాధ్యతకూడా ప్రభుత్వమే చేపడుతుందన్నారు. ఈ శుభ్రత కార్యక్రమానికి అయ్యే వ్యయాన్ని కూడా రాయితీ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రమాదాల్లో మృతి చెందితే ఆ మృత దేహాలను స్వగృహాలకు ఉచితంగా తెచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకునేటట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణంతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడి భవనాల నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. డ్వాక్రా మహిళలకు నెలకు కనీసం పది వేల రూపాయలు ఆదాయం సమకూర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండు రూపాయలకే స్వచ్చమైన 20లీటర్ల నీటిని అందించే దిశగా చర్యలు తీసుకున్నామని సి ఎం తెలిపారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టడానికి కొందరు సిద్దపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయడంతో పాటు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. మైనార్టీ వర్గాలకు 250కోట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఎక్కడైనా పార్టీ కార్యకర్త తప్పు చేస్తే అది తనపై వేయడం సరికాదన్నారు. వ్యవసాయానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, రాయితీ ద్వారా డ్రిప్ తదితర పథకాలను కూడా రైతులకు చేకూరుస్తున్నామన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్న 24వేల కోట్ల రుణమాఫీ చేసి దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. నేడు లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. విద్య, పారిశ్రామిక పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కుప్పం రాష్ట్రానికి ఆదర్శం
కుప్పం రాష్ట్రానికే ఆదర్శం అయ్యే విధంగా నేడు అనేక కార్యక్రమాలు కుప్పం నుంచే శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లె మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎన్నికల్లోను భారీ మెజార్టీతో తనను గెలిపిస్తున్నందుకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అయితే ఇక్కడ కొందరు స్వార్థ రాజకీయాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వీటిని ప్రజలు గుర్తించి ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

చిత్రం.. గుడుపల్లె సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు