ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యుల బృందం గురువారం పర్యటించి, పనులను పరిశీలించింది. ఈ బృందంలో శాస్తవ్రేత్త శివకుమార్, సి పరమేశ్వరన్, లలితకుమార్ శోలంకి తదితరులున్నారు. పర్యటన ముగిసిన తర్వాత జరుగుతున్న పనులు, జరిగిన పనులనుగూర్చి బృందం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణం పూర్తయిన కుడి కాలువను, ఎడమ కాలువ నిర్మాణ పనులను బృందం పరిశీలించింది. గురువారం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులైన స్పిల్‌వే హెడ్ వర్క్స్‌ను, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులతోపాటు గేట్ల నిర్మాణాలను బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే నిర్మాణం పూర్తిచేసుకున్న ట్విన్ టనె్నల్స్, రెగ్యులేటర్ పనులను, నిర్మాణంలో వాడుతున్న సిమెంట్, మెటల్, ఇసుకను పరిశీలించారు. బృందంలో అనిల్‌కుమార్, అజయ్ మల్హోత్రా, షాసుద్దీన్ నీర్, సురేష్ మాల్యా, అమీష్ వాకర్ తదితరులున్నారు. వీరివెంట పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఇ ఎంఎస్ రాజు, డిఇ గోపాలకృష్ణ, ప్రాజెక్టు ఎఇలు కుమార్, బుల్లియ్య తదితరులు ఉన్నారు.