ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ పిజి కోర్సుల ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 20: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ పిజి కోర్సులకు గత నెల 28న జరిగిన ప్రవేశ పరీక్షా ఫలితాలను విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదరనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షకు సుమారు 900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎమ్మెస్సీ (వ్యవసాయం), ఎంటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ (గృహవిజ్ఞానం) కోర్సులకు సంబంధించి ఈ పరీక్ష నిర్వహించారు. వ్యవసాయంలో 119, గృహవిజ్ఞానంలో 15, వ్యవసాయ ఇంజనీరింగ్‌లో 13 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షా ఫలితాలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎఎన్‌జిఆర్‌ఎయు.ఎసి.ఇన్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. వివిధ కోర్సుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈనెల 24వ తేదీన లాంఫాంలో జరుగుతుందని పిజి స్టడీస్ డీన్ ఆర్ వీరరాఘవయ్య తెలిపారు.
పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రారంభం
ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయ పరిధిలో 2017-18 సంవత్సరానికి విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, మూడేళ్ల వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులకు లాంఫారం ఆడిటోరియంలో కౌన్సిలింగ్‌ను వర్శిటీ విసి వల్లభనేని దామోదరనాయుడు ప్రారంభించారు. తొలిరోజున ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలో నాన్‌లోకల్ కేటగిరిలో ఉన్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
విశ్వవిద్యాలయ పరిధిలో 19 ప్రభుత్వ పాలిటెక్నిక్, గుర్తింపు ఇచ్చిన 76 ప్రైవేటు పాలిటెక్నిక్‌లతో కలిసి రాష్ట్రంలో 95 కళాశాలలు ఉన్నాయని దామోదరనాయుడు తెలిపారు. వీటిలో 3,560 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. కోర్సు చదివిన తర్వాత అగ్రి సెట్ పరీక్ష నిర్వహించి ప్రతి ఏటా 112 మందిని బిఎస్సీ వ్యవసాయ కోర్సుల్లో చేర్చుకుంటున్నట్లు తెలిపారు.