ఆంధ్రప్రదేశ్‌

324 మంది కాంట్రాక్టు వైద్యుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, జూలై 20: రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో 324 మంది వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 324 మంది వైద్యుల నియామకంతోపాటు 113 మంది గైనకాలజిస్టులు, 116 మంది మత్తు డాక్టర్లు, 95 మంది పిల్లల వైద్యులు, 418 స్ట్ఫా నర్సులను నియమించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే అనుమతి ఇస్తామని మంత్రి తెలిపారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్‌టిఆర్ కిట్లను ఇప్పటికే అందిస్తున్నామన్నారు. త్వరలో మదర్ కిట్లను ఇవ్వబోతున్నామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వైద్యశాలల్లో వైద్యులు, నర్సులను నియమించి అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ పద్దతి అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కార్డియాలజి కొరత ఎక్కువగా ఉందని, దీన్ని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మందుల కొరత లేకుండా 50 లక్షలు నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.