ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తులపై కనే్నసిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 20: అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సహచర మంత్రులు కనే్నశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులు అగ్రిగోల్డ్ సంస్థకు డబ్బులు చెల్లించి నష్టపోయారన్నారు. ఆ సంస్థకు చెందిన భూములు విక్రయించి బాధితులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలకు చేసిన మోసంపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. కాగా గత ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రెయిన్‌గన్ల ద్వారా పంటలకు రక్షకతడులు ఇచ్చినా పంటలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని రఘువీరా ఆరోపించారు. ఇందులో సైతం ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు దోపిడీకి పాల్పడ్డారన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా రాయలసీమలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదన్నారు. 1500 అడుగులు వేసిన బోర్లలో నీరు లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి సమయంలో రక్షకతడుల ద్వారా పంటలకు నీరు అందిస్తామని ఎలా చెబుతారని రఘువీరా ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు చెప్పడానికి, నిధులు దోచుకోవడానికే తప్ప రైతులను ఉద్దరించేందుకు కాదన్నారు. టిడిపి ఎప్పుడు అధికారంలో ఉన్న వర్షాలు రావని, రైతులు దిగుబడులు సాధించిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా కాలువ పనులను ఈ ఏడాది చివరి నాటికి అయినా పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పిసిసి అధికార ప్రతినిధి రమణ, జిల్లా కార్యదర్శి సొరంగాల నాగరాజు పాల్గొన్నారు.