ఆంధ్రప్రదేశ్‌

వేగంగా ఫైబర్ నెట్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: యద్ధప్రాతిపదికన ఫైబర్ నెట్ పనులు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఎపి ఫైబర్ నెట్ సంస్థ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ సంఖ్యలో సెట్ టాప్ బాక్స్‌లను సేకరించి, ప్రతి ఇంటికీ వెంటనే ఇచ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఇతర శాఖల అధికారులతో కలిసి పని చేయాలన్నారు. జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పంచాయితీరాజ్‌శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. 23,800 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని, 23,304 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, మరో 38,969 ఇళ్లకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఎపి ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ అజయ్ జైన్ పాల్గొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9000 కోట్ల రూపాయల మేర ఉపాధి నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల సహకారం కావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా బడ్జెట్‌ను రూపొందించాలన్నారు. 2019 నాటికి గ్రామాల్లో చెత్త ఉండకుండా చూడాలని, వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో ఆట స్థలాల అభివృద్ధి, మినీ స్టేడియంల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
త్వరలో స్వచ్ఛ పంచాయితీ పోటీలను నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. త్వరలోనే గ్రామాలకు 7 స్టార్ రేటింగ్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎల్‌ఇడి లైట్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు.

చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి లోకేష్