ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలకు ఫైబర్‌నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఫైబర్‌నెట్, కేబుల్, టెలిఫోన్ సౌకర్యం నంద్యాల నియోజకవర్గ వాసులకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా ఫైబర్‌నెట్ సేవలు ప్రారంభించినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సేవలను ప్రారంభించిన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రమే సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఆ తరువాత పలు సాంకేతిక కారణాలరీత్యా ఫైబర్‌నెట్ పథకం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అతి తక్కువ ధరకే అన్ని చానళ్లతో కూడిన కేబుల్ టివి, 100 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్, నెట్‌వర్క్ ఫరిధిలో ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం ఉన్న టెలిఫోన్ ఒకే కనెక్షన్‌తో ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నెట్‌వర్క్ అందుతున్నా అక్కడి ప్రజలకు చేరవేయడంలో సాంకేతికంగా సాధ్యపడలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. అంతేగాక అవసరమైనన్ని సెట్‌టాప్ బాక్సులు కూడా లేకపోవడం మరో కారణమని వారంటున్నారు. సంవత్సర కాలంగా కసరత్తు జరుగుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 23,800 కనెక్షనే్ల ఇవ్వడం గమనార్హం. మరో 38 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నంద్యాలలో 50 వేల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. కానీ నంద్యాలలో భారీ లక్ష్యం నిర్ణయించడంతో శరవేగంగా కనెక్షన్లు ఇచ్చేందుకు ఫైబర్ నెట్ అధికారులు రంగంలోకి దిగారు.