ఆంధ్రప్రదేశ్‌

పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 21: పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలనే అనుమానం కలుగుతోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి పోలవరాన్ని పక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. పోలవరం కట్టకపోతే చంద్రబాబునాయుడు జాతి ద్రోహిగా మిగులుతారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టిసీమపై కనీస అవగాహన లేన్నట్టు టివి చర్చ సందర్భంగా అన్పించిందన్నారు. చర్చ వ్యక్తిగత దూషణవైపు దారి తీసిందని, అలా కాకుండా టెక్నికల్ అంశాలపై ఆఫీసులో అటెండర్ చర్చకు వచ్చినా తాను సిద్ధమేనని తన వాదన తప్పని తేలితే క్షమాపణ కోరతానని ఉండవల్లి చెప్పారు. వైఎస్ బతికివుండగా రాజా ఆఫ్ కరెప్షన్ అనే పుస్తకాన్ని టిడిపి ప్రచురించిందని, ఈ పుస్తకంలో చేసిన ఆరోపణలపై టిడిపి వాళ్ళు సాక్ష్యాధారాలతో ముందుకొస్తే చర్చించేందుకు తాను ఇప్పటికీ సిద్ధమేనన్నారు. జల యజ్ఞంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పుస్తకంలో ఉన్న ప్రధాన కాంట్రాక్టర్లంతా ఇపుడు టిడిపి, బిజెపిలోనే ఉన్నారన్నారు. నామా, మెగా కృష్ణారెడ్డి, రాయపాటి, కావూరి ఇలా ఎవరిని అడిగినా అప్పటి అవినీతి బయటకు వస్తుందన్నారు. పోలవరంలో మొత్తం 16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాల్సివుండగా కేవలం లక్ష క్యూబిక్ మీటర్లే జరిగిందని తేల్చారని, ప్రత్యేక ఇఎన్‌సిని వేయాలని కమిటీ సూచిస్తోందన్నారు. పాలమూరు, రంగారెడ్డి పథకం విషయంలో కెసిఆర్ మాట్లాడుతూ కృష్ణా నది మీ అబ్బసొత్తా అని ఆరోపిస్తే కనీసం ముఖ్యమంత్రి నోరు మెదపలేకపోయారన్నారు. ఏ అనుమతివుందని పట్టిసీమ కడుతున్నారని కెసిఆర్ ప్రశ్నిస్తుంటే కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. పట్టిసీమలో కాగ్ రూ.372 కోట్లు అదనపు చెల్లింపులు చేశారని తప్పుపడితే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కేవలం రూ.372 కోట్ల కోసమే ఈ పట్టిసీమ కట్టారా అన్పిస్తోందన్నారు. పోలవరం పక్కనబెట్టి పట్టిసీమ, పురుషోత్తపట్నం కట్టారని అనుమానం కలుగుతోందన్నారు. పట్టిసీమ ద్వారా మొదటి సంవత్సరం 4.216 టిఎంసిల నీటిని తోడితే అసెంబ్లీలో 8 టిఎంసిలు తోడినట్టు తెలిపారని, అసెంబ్లీకి తప్పుడు లెక్కలు చెబితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. రాజ్యసభలో జల వనరుల శాఖ మంత్రి బాల్యన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 4.216 టిఎంసిల నీరే తోడినట్టు చెప్పడాన్ని బట్టి చూస్తుంటే తప్పుడు లెక్కలు ఇచ్చిన రాష్ట్ర ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సివుందన్నారు.
పోలవరం ప్రారంభమైతే రివర్స్ లిఫ్ట్ కూడా పెట్టొచ్చని, అంతటి ప్రయోజనం కలిగిన ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తాను బతికుండగా పోలవరం పూర్తయిందనే మాటవినాలని ఆశపడుతున్నానన్నారు.