ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్లకు త్వరలోనే క్యాబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 21: కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. కాపులకు ద్రోహం చేసిన విపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి పంచనచేరి, కాపులకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై ముద్రగడ దాడికి దిగడం దారుణమని రామానుజయ విమర్శించారు. టిడిపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ముద్రగడ కాపు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 26వ తేదీన విజయవాడలో కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందిన వేలాదిమందితో వౌనదీక్ష చేపడతామని స్పష్టంచేశారు. ఈ దీక్షకు కాపు కార్పొరేషన్ లబ్ధిదారులంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాపుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. మూడేళ్లలో తమ ప్రభుత్వం 2500 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. రిజర్వేషన్ కోసం మంజునాథ కమిషన్‌ను నియమించిందని, కార్పొరేషన్ ద్వారా వెయ్యి మంది కాపు విద్యార్థులను విదేశీ చదువులకు పంపామన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై ముద్రగడ దురుద్దేశపూర్వకంగా ఎదురుదాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుందని, ఈ లోగా దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇప్పటికే బిసి కమిషన్, పల్స్ సర్వే నివేదికలను సిఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెప్పారు. తుని సభకు అనుమతిస్తే హింసను ప్రేరేపించారని, కాపులను ఓటుబ్యాంకుగా తల్లి, పిల్లకాంగ్రెస్‌లు వినియోగించుకునేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.