ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై నమ్మకం కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 21: దేశ రాష్టప్రతిగా ఎన్నికైన కోవింద్ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై నమ్మకం కలిగే విధంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ భారత రాష్టప్రతి స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఓటు వేసిందన్నారు. రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతిగా ఎన్నిక కావడం ఆనందదాయకమన్నారు. గతంలో బిజెపి ఎంపిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో ముస్లింలు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అవసరం లేదని కోవింద్ పేర్కొన్నారన్నారు. దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు మన దేశం వారు కాదని, ఇతర దేశాలకు చెందినవారని మాట్లాడిన మీరు వ్యక్తిగతమా లేక బిజెపి సిద్ధాంతాల మేరకు మాట్లాడారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైకాపా దళితులు, ముస్లింల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుందన్నారు.