ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా వరద గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 21: వరద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. ఉపనది శబరికి వరద తాకడంతో నురగలతో వడిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద శుక్రవారం సాయంత్రానికి నిలకడగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కాస్తంత తగ్గుముఖం పట్టినా దిగువ ప్రాంతానికి వేగంగా నీటి మట్టం పెరుగుతూ ఉరకలేస్తోంది. కాటన్ బ్యారేజి ఎగువ భద్రాచలం వద్ద సాయంత్రం 4 గంటలకు 35.7 అడుగుల ఎత్తులో ప్రవహించిన నది సాయంత్రం ఆరు గంటలకు 34.6 అడుగుల స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8.70 అడుగుల నీటి మట్టం నమోదైంది. బ్యారేజి 175 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తివేసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 5.60 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచి పెట్టగా అదే సాయంత్రానికి 4 లక్షల 39 వేల 969 క్యూసెక్కులు వదిలారు. సాగునీటి నిమిత్తం ఈస్ట్రన్ డెల్టాకు 3600 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1800, వెస్ట్రన్ డెల్టాకు 5000 క్యూసెక్కుల జలాలను ఆయకట్టుకు విడుదల చేశారు. పాండ్ లెవెల్ 13.32 మీటర్ల ఎత్తులో ప్రవాహాన్ని నిర్వహిస్తున్నారు. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది.