ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆక్వా ల్యాబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 21: ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ల్యాబ్‌లను నెలకొల్పుతోంది. రొయ్యలు, చేపల సాగులో కీలకమైన నీరు, మట్టి, వైరస్ పరీక్షలకు ఈ ల్యాబ్‌లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో మొత్తం 22 ల్యాబ్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నెలకొల్పనున్నారు. ప్రస్తుతం విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు, ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు, నెల్లూరు ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇక ప్రైవేటు ల్యాబ్‌లైతే పుట్టగొడుగుల్లా ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 300 వరకు ఈ తరహా ల్యాబ్‌లున్నాయి. ఇక హేచరీల పరధిలో మ రో 200 వరకు ఉంటాయి. వీటన్నింటిని కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుం ది. దీని కోసం జిఒ 49ను ప్రభుత్వం జారీచేసి,ది. ఈ జిఒ ప్రకారం మత్య్సశాఖ, ఎంపెడ సంయుక్తంగా ల్యాబ్‌లను తనిఖీలు చేసి వాటిని క్రమబద్ధీకరిస్తారు. వాటికి ఐదేళ్ల కాలపరిమితి ఇస్తారు. క్రమబద్ధీకరించిన ల్యాబ్‌ల ద్వారా ఎవరైన ఆక్వా రైతులు పరీక్షలు చేయించుకుంటే వారికి ధ్రువపత్రాలు కూడా ఇస్తారు.

చిత్రం.. ప్రైవేటు ఆక్వా ల్యాబ్‌ను తనిఖీచేస్తున్న ఎంపెడ, మత్య్సశాఖ అధికారులు