ఆంధ్రప్రదేశ్‌

విపత్తు నిర్వహణపై మరిన్ని పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: విపత్తుల నిర్వహణపై నిపుణులైన శాస్తవ్రేత్తల పరిశోధనలను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంవి శేషగిరిబాబు పేర్కొన్నారు. స్థానిక రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో శుక్రవారం ‘రిమోట్ సెన్సింగ్, వాతావరణ పరిస్థితుల్లో ఉపగ్రహ సమాచార వినియోగం’ అనే అంశంపై జిల్లా అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్, ఏడు యూనివర్సిటీల విద్యార్థులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిబాబు మాట్లాడుతూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పరిశోధనలను పెంపొందించడం ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకతకు చేయూత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా కోస్తా జిల్లాల గ్రామాల పరిధిలో స్కూళ్లలోని విద్యార్థులకు విపత్తు నివారణ సంబంధ అంశాలతో కూడిన అవగాహన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందుకోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు శిక్షణను అందించే కార్యాచరణ ప్రణాళికలను జిల్లాల వారీగా రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ పిజి దివాకర్ ఇ-లెర్నింగ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనల్లో ఇతోధికంగా ఉపయోగపడుతుందన్నారు. ఉపగ్రహం నుంచి వచ్చే డేటాను ఎనాలసిస్ చేయడం ద్వారా పరిశోధనలకు ఎన్‌ఆర్‌ఎస్‌సి సంస్థ నుండి వివరాలు పొందవచ్చన్నారు. ఐఎండి డైరెక్టర్ డాక్టర్ వైకె రెడ్డి ఈ సందర్భంగా రిమోట్ సెన్సింగ్, శాటిలైట్, రాడార్ అప్లికేషన్స్ ఇన్ ఎట్మాస్పియర్ సైనె్సస్ అంశంపై విద్యార్థులకు వివరాలు అందించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి గ్రూప్ డైరెక్టర్ ఎన్.అపర్ణ, ఇతర శాస్తవ్రేత్తలు.. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, అప్లికేషన్స్‌పై నూతన సాంకేతిక ఒరవడిని వివరించారు. ఇన్‌కోస్ శాస్తవ్రేత్త ఎన్.శ్రీనివాసరావు, ఏయు ప్రొఫెసర్ రామకృష్ణ పాల్గొన్నారు.
సమాచారం చేరవేతకు ‘కో డి రా’ యాప్
విపత్కర పరిస్థితుల్లో మొబైల్ టెక్నాలజీతో సమాచారాన్ని చేరవేసేందుకు మంగళూరు ప్రొఫెసర్ ఎం.రామనాథ్ రూపొందించిన కో డి రా యాప్ టెక్నాలజీపై వివరాలను విలేఖరుల సమావేశంలో అం దించారు. సెల్‌ఫోన్లు పనిచేయకపోయినా సమాచారాన్ని చేరవేసేందుకు కో డి రా యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తమ విద్యార్థులు రూపొందించిన క్షేత్రస్థాయి ఫలితాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. టెలిఫోన్ సిగ్నల్స్ లేకపోయినా 300 మీటర్ల పరిధిలో సమాచారాన్ని చేరవేయగలుగుతున్నామని, దీనిని 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు పెంచటం సాధ్యమేనని ఆయన తెలిపారు.