ఆంధ్రప్రదేశ్‌

దేవరాపల్లి దళితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 21: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి గ్రామంలో దళితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో విలేఖరులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కోర్టు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ యంత్రాంగం గ్రామంలో దళితులు సాగుచేసుకుంటున్న భూమి ని గ్రామ పంచాయతీకి స్వాధీనం చేసిందన్నారు. 40 ఎకరాల చెరువు భూమి ఉండగా, 45 కుటుంబాలు 22 ఎకరాలను సాగు చేసుకుంటున్నాయన్నారు. ఆ ప్రాంతానికి సాగర్ జలాలు రావని, సాగుకు వర్షాలే ఆధారమని అన్నా రు. దీన్ని దృష్టి లో పెట్టుకుని, సాగునీటి అవసరాల కోసం చెరువులో నీరు-చెట్టు పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. దీంతో ఆ చెరువులో భూములు సాగు చేసుకుంటూ జీవనాధారం కోల్పోయిన వారికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, స్థలాలు, భూములు అందజేసి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వివరించారు. స్థానిక శాసనసభ్యులు కూడా దళితులకు సౌకర్యాలు కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. స్థానిక దళితులు ప్రభుత్వానికి సహకరిస్తున్నా, వైఎస్‌ఆర్ సిపి, సిపిఎం నాయకులు అనవసర రాద్ధాంతం చేయ డం పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో వాన్‌పిక్ కోసం 44వేల ఎకరాలు తీసుకున్నారని, అక్కడి రైతులు కూడా భూముల కోసం ఎదురు చూస్తున్నారని, ఇది గమనించాలని మంత్రి వ్యాఖ్యానించారు.