ఆంధ్రప్రదేశ్‌

గవర్నరుకిది భావ్యం కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో చర్చల సారాంశాన్ని గవర్నర్ వెల్లడించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వర్ల రామయ్య స్థానిక విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ అన్ని కేసులు ఒకేసారి విచారించటం కుదరదని రాష్ట్ర హైకోర్టు నిన్న తేల్చి చెప్పటంతో బెంబేలెత్తిపోయిన జగన్ ఆగమేఘాల మీద రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శరణుజొచ్చాడన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఫోన్‌లోనే గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని హడావుడిగా గవర్నర్‌ను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. తన సెక్యూరిటీని లోటస్ పాండ్‌లోనే వదిలి, పిఎస్‌ఓలను అతని వెంట తీసుకువెళ్లకుండా, ఎస్కార్టు వాహనాన్ని ఇంటి వద్దనే వదిలి, రోజూ వాడే అధికార వాహనాన్ని కూడా వదిలి తన స్నేహితుని కొత్త వాహనంలో ఒంటరిగా గవర్నర్‌ను కలిసి గంటసేపు ఏకాంతంగా మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. గవర్నర్‌తో ఒంటరిగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించే ప్రజా సమస్యలు ప్రస్తుతం రాష్ట్రంలో లేవన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జగన్ అపాయింట్‌మెంట్ అడగటం, గవర్నర్ ఇవ్వటం, ఏకాంత చర్చలు జరపటం పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ఇటువంటి సందర్భాల్లో గౌరవ గవర్నర్ కార్యాలయం కూడా అత్యంత పారదర్శకతతో వ్యవహరించవలసి ఉందన్నారు. నిన్న జగన్, గవర్నర్ మధ్య జరిగిన ఏకాంత చర్చలు పలు అనుమానాలకు దారితీసిరాష్ట్రంలో చర్చాంశంగా మారటం శోచనీయం. వెంటనే గవర్నర్ కార్యాలయం, నిన్నటి సంఘటనపై రాష్ట్ర ప్రజలకు సవివరంగా వివరణ ఇచ్చి, వారి అనుమానాలు పటాపంచలు చేయాలని కోరుతున్నామన్నారు.