ఆంధ్రప్రదేశ్‌

వైద్యుల రిటైర్‌మెంట్ వయసు 65 ఏళ్ళకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 9: వైద్యుల పదవీ విరమణ వయసు 65 ఏళ్ళకు పెంచేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం విశాఖ జెడ్‌పి సమావేశ మందిరంలో జరిగిన ఉత్తరాంధ్ర ఆరోగ్యశాఖాధికారుల ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ వైద్య వృత్తి పవిత్రమైందని, ప్రతిఒక్క వైద్యుడు అంకింతభావంతో పనిచేయాలన్నారు. పేదవారికి ఉచిత వైద్యసౌకర్యం కల్పించిన ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా మెరుగైన వైద్యాన్ని రోగులకు అందివ్వాలన్నారు. మాతాశిశు మరణాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 193 సామాజిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా వైద్య విధాన్ పరిషత్‌కు అప్పగించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వైద్యులను నియమించనున్నామన్నారు. విశాఖ మన్యంలో పనిచేసే వైద్యుల వేతనం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్నారుల ఆరోగ్య కోసం అందజేసే వ్యాధి నిరోధిక టీకాలను ఇంటికి చేర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఇందులో రాష్ట్రంలో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి తొలిస్థానంలో ఉందన్నారు. వైద్యా, ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులను అవసరమైతేనే డిప్యుటేషన్ వేయాలన్నారు. అయితే సాధారణంగా డిప్యుటేషన్లు ఇచ్చేదిలేదన్నారు. అనధికారిక సెలవుపై విదేశాలు వెళ్ళే వైద్యులను ఉపేక్షించేదిలేదని మంత్రి హెచ్చరించారు.