ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి రూ.518 కోట్ల కరవు నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రాకు కరవు సహాయక చర్యలకోసం జాతీయ విపత్తు నిధి నుంచి రూ.518 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి ఎస్.ఆహ్లువాలియా తెలిపారు. ఆంధ్రాలో నెలకొన్న కరువు సహాయ చర్యలకోసం రూ.3173 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో వైఎస్సాఆర్‌సిపి ఎంపి విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ఆంధ్రాకు కేంద్రం కరవు సహాయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే మంత్రిత్వా శాఖ సిఫార్సుల ప్రకారం కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 50 రోజులు ఉపాధి హామీ పనులు మంజూరు చేస్తున్నట్లు కూడా ఆహ్లువాలియా తెలిపారు. అలాగే ఆంధ్రాలో చెరుకు రైతులకు చెక్కర మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది జూన్ 30నాటికి రూ.44.42 లక్షలు మాత్రమేనని వినియోగదారుల వ్యవహారాల, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఆంధ్రా రైతులకు చెక్కర ఫ్యాక్టరీలు రూ.250కోట్ల మేర బకాయిలు పడిన మాట వాస్తవమేనా అని విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే రాజ్యసభలో స్విస్ చాలెంజ్ విధాన నియంత్రణ బిల్లును, పరువు హత్యల నియంత్రణ బిల్లు, ప్రైవేటు మెంబరు బిల్లులను ఆయన ప్రవేశపెట్టారు.