ఆంధ్రప్రదేశ్‌

3 నెలలు... 17వేల బోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: ఎన్టీఆర్ జలసిరి కింద వేసిన 17 వేల బోర్లను మూడు నెలల్లో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలతో ఉపాధిహామీ పథకం అనుసంధానానికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి 7 స్టార్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. 7 స్టార్ కార్యక్రమంలో గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆదాయం కల్పించడం కీలకమన్నారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు ఉపాధిని అనుసంధానం చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కళా వెంకటరావు, శిద్దా రాఘవరావు, పంచాయితీరాజ్ కమిషనర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
క్యాష్‌లెస్ సిటీగా విశాఖ
దేశంలోనే తొలి నగదు రహిత లావాదేవీల నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో వీసా కంపెనీ ప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖను క్యాష్‌లెస్ సిటీగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల పురోగతిపై, వివిధ ప్రభుత్వ శాఖ సహకారం తదితర అంశాలపై చర్చించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు వీలుగా నగదు రహిత విధానంలో టికెట్ తీసుకునేందుకు రూపొందించిన విధానాన్ని మంత్రికి వీసా ప్రతినిధులు వివరించారు. పర్యాటక రంగంలో వినియోగించేందుకు వీలుగా రూపొందిస్తున్న మొబైల్ యాప్‌ల గురించి కూడా వివరించారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ డెలివరీ, టూరిజం, వుడా, తదితర ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వారిని మంత్రి కోరారు. నగదు రహిత లావాదేవీలు చేసే వారికి ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దేశంలోనే తొలి నగరంగా ఈ అంశంలో విశాఖను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. వ్యవసాయానికి ఉపాధిహామీ పథకం అనుసంధానంపై సమీక్షిస్తున్న మంత్రి లోకేష్