ఆంధ్రప్రదేశ్‌

రంగంలోకి దిగిన పికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: ప్రశాంత్ కిషోర్ (పికె)..ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. మోదీని ప్రధానిగా, నితీష్‌ను ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైకాపాను అధికారంలో తెచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇటీవల జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ క్యాడర్‌కు జగన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఇంకా రెండేళ్లున్నాయి కదా అన్న ధీమా పడకుండా తన బృందాలను రంగంలోకి దించాడు పికె. 200 మంది యువకులను ఎంపిక చేసి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంపించారు. పార్టీ బలగం ఏవిధంగా ఉంది? పార్టీ, అక్కడున్న కో-ఆర్డినేటర్ బలం, బలహీనతల గురించి వీరు ఆరా తీస్తున్నారు. ముందుగా నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో ఈ బృందం సమావేశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై వీరు ఆరా తీస్తున్నారు. ఇప్పుడున్న కో-ఆర్డినేటర్ గురించి పార్టీ క్యాడర్ ఏమనుకుంటోంది? ఒకవేళ అభ్యర్థిని మార్చాల్సి వస్తే, ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై ద్వితీయ శ్రేణి క్యాడర్‌తో మాట్లాడుతున్నారు. కేవలం పార్టీ గురించి మాత్రమే వీళ్లు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మిగిలిన పార్టీల గురించి వీరు ఏమాత్రం మాట్లాడకపోవడం గమనార్హం. మీడియా టీంను జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు. సీనియర్ విలేఖరులతో వీరు మాట్లాడుతున్నారు. కేవలం వైకాపాలో ఉన్న లోపాలు, చేయాల్సిన చికిత్స గురించి వీరు చర్చిస్తున్నారు. సాంకేతిక బృందం ఒకటి పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు వీరు సేకరించిన సమాచారాన్ని ఆ బృందానికి అందచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలపై పార్టీ వద్ద ఉన్న సమాచారంతోపాటు, ఈ బృందం సేకరించిన సమాచారాన్ని జోడించనున్నారు. దానిని విశే్లషించి పార్టీకి చేయాల్సిన కాయకల్ప చికిత్స ఏంటన్నది ఆలోచించనున్నట్టు భోగట్టా.
భాషతో సమస్య!
ఇదిలా ఉండగా సర్వేకు పంపిన యువకుల్లో చాలామంది ఉత్తరాదికి చెందిన వారు. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చినా వారంతా హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు చెప్పిన అభిప్రాయాలను వారి భాషలో తర్జుమా చేసేందుకు ఒకరిద్దరు ఉన్నప్పటికీ, క్యాడర్ భావాలను యథాతథంగా సర్వే బృందానికి చేరవేయలేకపోతున్నారు. వీరు కాకుండా మరో 100 మంది యువకులు మలివితడ సర్వేకి వచ్చే 10, 15 రోజుల్లో రాబోతున్నట్టు తెలుస్తోంది.