ఆంధ్రప్రదేశ్‌

నిర్మాణ రంగానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 21: ఈ ఏడాది నిర్మాణ రంగంలో భారీ వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయం 2వ బ్లాక్‌లోని తన చాంబర్‌లో పరిశ్రమలు, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డిపి)ని శుక్రవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా కూడా ప్రభుత్వ గృహ నిర్మాణాలతోపాటు ప్రైవేట్ రంగంలో గృహ, ఇతర నిర్మాణాలు బాగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆ విధంగా ఈ రంగంలో భారీ వృద్ధిరేటు నమోదవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ గృహ నిర్మాణ పథకం పనులు చురుకుగా సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లో 52వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం క్షీణదశలో ఉందని, జాతీయస్థాయిలో కూడా వృద్ధిరేటు అంత ఎక్కువగా లేదని, అయితే రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అనుసరిస్తుండటం, భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తుండటం వల్ల పారిశ్రామిక పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధిరేటు 11 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. విధానపరమైన ప్రభుత్వ విధానాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలన్నారు.
మైనింగ్ అండ్ మినరల్స్‌కు సంబంధించి కొత్త పాలసీని రూపొందించమని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త పరిశ్రమలు, ఏఏ ఉత్పత్తులు ఎంత పరిమాణంలో జరుగుతున్నాయో, ఒకవేళ మూతపడితే ఏ ఉత్పత్తుల పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గణాంక శాఖ అన్ని అంశాల్లో సమగ్రంగా, కచ్చితమైన సమాచారం సేకరించాలని యనమల ఆదేశించారు. స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా ఐటిఐ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సిలబస్‌లో మార్పులు చేయవలసిన అవసరం ఉందని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. టెక్స్‌టైల్ రంగంలో 100 శాతం ఉద్యోగావకాశాలు స్థానికులకే లభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోఖ్య రాజ్, ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఏపి స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సిఈఓ సంజయ్ గుప్త, పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పనశాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు