ఆంధ్రప్రదేశ్‌

మెట్రోస్థానంలో ఎలక్ట్రానిక్ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 21: విజయవాడలో మెట్రో రైలుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటిశాఖామంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి ఆటో నగర్ ఐటి పార్కులో ఫై కేర్ ఐటి కంపెనీ ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విలేఖర్లతో మాట్లాడారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు 7,500 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోందని, ఎలక్ట్రానిక్ బస్సులు పెడితే 2500 నుంచి 3 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతున్నందున ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను సహించేది లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఆటలు సాగబోవన్నారు. సిఆర్‌డిఎ పరిధిలో 10 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని కమాండ్ అండ్ కంట్రోల్ రూంకి లింక్ చేసి ఎవరు నేరాలు చేసినా వెంటనే పట్టుబడే విధంగా చర్యలుంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మాఫియాకు అవకాశం లేదన్నారు. తప్పుచేస్తే నాతో సహా ఎవరూ తప్పుకోలేరని లోకేష్ అన్నారు. అధికారం కోసం ప్రతిపక్ష నేత జగన్ కంటున్న కలలు నెరవేరవని, ప్రజలు చంద్రబాబు వెనుకే ఉన్నారన్నారు. సినీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.