ఆంధ్రప్రదేశ్‌

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: హైదరాబాద్‌లో ఈనెల 24 తేదీ నుంచి 27 తేదీ వరకు జరుగనున్న ప్రాంతీయ సమగ్ర వాణిజ్య ఒప్పందం ‘ఆర్‌సిఇపి’ సమావేశాల నుంచి భారత ప్రభుత్వం వైదొలగాలని రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆర్‌సిఇపి సమావేశాలకు వ్యితిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రతిఘటన వేదిక’లో రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ భాగస్వాములు కావాలని, 23న హైదరాబాద్‌లో జరిగే ప్రజా సదస్సులో పాల్గొనాలని నిర్ణయించారు. డబ్ల్యుటివో ఒప్పందాల వల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైతులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని ఈ సందర్భంగా వడ్డే అన్నారు. విదేశాల నుంచి చక్కెర, పామాయిల్, పత్తి లాంటి ఉత్పత్తులను విచ్చలవిడిగా దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధరలు లభించక తల్లడిల్లిపోతున్నారన్నారు. చైనా నుంచి చౌక దిగుమతుల వల్ల దేశంలో అనేక పరిశ్రమలు మూలనబడ్డాయని రంజన్‌సేన్ గుప్తా అన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మరిన్ని చౌక దిగుమతులు వరదలా వస్తాయన్నారు. ముఖ్యంగా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నీ పార్లమెంట్‌కు తెలియకుండా ప్రజలకు తెలియకుండా జరుగుతున్నాయని ఇవి పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనవని... అందుకే భారత ప్రజల హక్కులను, వనరులను కాజేసే ఇటువంటి ఒప్పందాల నుంచి వెలుపలకు రావాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎంవి శివరామకృష్ణారెడ్డి, రైతు సంఘాల నేతలు ఎర్నేని నాగంద్రనాధ్, ఎన్.బ్రహ్మయ్య, పిఎస్ అజయ్‌కుమార్, అనుమోలు గాంధీ, రావుల వెంకయ్య, వై.కేశవరావు, వి.అజాద్, కెవివి ప్రసాద్, కనె్నగంటి రవి, తదితరులు ప్రసంగించారు.