ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లల్లో 2 లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/మంగళగిరి, జూలై 21: రాష్ట్రంలో వచ్చే రెండేళ్ల కాలంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. మేడిన్ ఆంధ్ర కార్యక్రమంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన సెల్‌కాన్ కంపెనీ తయారుచేసిన స్మార్ట్ఫోన్‌ను వెలగపూడి సచివాలయం తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆవిష్కరించారు. అంతకుముందు మంగళగిరి పట్టణ శివారులోని ఆటోనగర్ ఐటి పార్కు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్యరంగంలో ఐటి సొల్యూషన్స్ అందించే ఫై కేర్ ఐటి కంపెనీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో 22 ఎకరాల్లో పంటపొలాల మధ్య ఏర్పాటు చేసిన ఐటి క్లస్టర్‌లో ఊహించని విధంగా 220 కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం వల్లేనన్నారు. అమరావతిలో ఐటి అభివృద్ధి చేస్తామంటే అంతగా అవకాశాలుండవని చెప్పారని, ముఖ్యమంత్రిపై నమ్మకంతో ఐటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఇక్కడ 22 ఎకరాల ఐటి క్లస్టర్‌లో 2019 నాటికి 10 వేల మందికి ఉద్యోగాలొస్తాయని, రాష్ట్రం మొత్తం మీద వచ్చే రెండేళ్లల్లో ఐటిరంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని, ఇందులో 25 వేల ఉద్యోగాలు సిఆర్‌డిఎ పరిధిలోని వారికే వస్తాయని, మిగతావి ఇతరులకు వస్తాయని లోకేష్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్, అసెంబ్లింగ్‌లో ఎపి అగ్రగామిగా ఉండబోతోందని, ఈ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు వచ్చే రెండేళ్లలో లభిస్తాయని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మేడిన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని రేణిగుంటలో ఉత్పత్తిని ప్రారంభించిన సెల్‌కాన్ సంస్థలో నెల రోజుల్లోనే స్మార్ట్ఫోన్‌ను తయారుచేసి, మార్కెట్‌లో విడుదల చేయడం అభినందనీయమన్నారు. సెల్‌కాన్ కంపెనీ తొలిసారిగా తయారుచేసిన స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. సెల్‌కాన్ సంస్థకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం చూసి, మరో సెల్ కంపెనీ కార్బన్ కూడా మరో మూడు నెలల్లో రేణిగుంటలో యూనిట్‌ను నెలకొల్పనుందన్నారు. ఇదే కాక మరెన్నో సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. 2019 నాటికి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రేణిగుంటలో మరిన్ని సెల్ కంపెనీలు స్థాపించి, అక్కడే లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. దేశంలో 10 సెల్‌ఫోన్లు తయారుచేసే కంపెనీలు ఏర్పాటైతే రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల కాలంలో ఏపీలో మూడు సెల్‌ఫోన్లు తయారీ సంస్థలు ఉండడం గర్వకారణమన్నారు. కేవలం సెల్ ఫోనే్ల కాకుండా ఛార్జర్‌లు, హెడ్ ఫోన్లతో పాటు ఇతర మెటీరియళ్లు తయారుచేసే విధంగా ఆయా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అనంతపురంలో ఇప్పటికే కియో మోటార్ కంపెనీ ప్రారంభానికి సిద్ధమైందన్నారు. దీనికి అనుబంధంగా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సంస్థను ఏర్పాటుచేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రతిష్టాత్మక సెల్‌ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ స్థాపించడమే కాకుండా దాని యూనిట్‌ను సొంత జిల్లాలోనే ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేవలం స్మార్ట్ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర మెటీరియల్ తయారీకి అవసరమైన ఎకో సిస్టమ్‌ను సెల్‌కాన్ సంస్థ చైర్మన్ గురుస్వామినాయుడు ఏర్పాటు చేయనున్నారన్నారు. చైనాలో యాపిల్ సంస్థ స్థాపించిన నగరం మాదిరిగా తిరుపతి రేణిగుంటలో సెల్‌ఫోన్ల నగరం అభివృద్ధి చెయ్యాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.
ఈ సమయంలో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. సెల్‌కాన్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ చైర్మన్ గురుస్వామినాయుడు మాట్లాడుతూ యూనిట్ స్థాపించిన నెల రోజుల్లోనే స్మార్ట్ఫోన్ తయారుచేసి, మార్కెట్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి రేణిగుంటలో ప్రపంచస్థాయిలో సెల్‌కాన్ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పామన్నారు. కేవలం ఫోన్‌లే కాకండా బ్యాటరీలు, హెడ్‌ఫోన్లతో పాటు కెమెరాలు, ల్యాప్‌టాప్, సెటాప్ బాక్సులు వంటి ఇతర వస్తువుల తయారీ యూనిట్లను స్థాపిస్తామని వెల్లడించారు. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు చేసేలా ఉత్పత్తులు చేస్తామన్నారు. రేణిగుంటలో స్థాపించిన యూనిట్‌లో ఏడాదికి 10 లక్షల సెల్‌ఫోన్ల తయారీ సామర్ధ్యం ఉందన్నారు.

చిత్రం.. వెలగపూడి సచివాలయంలో సెల్‌కాన్ స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్