ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ రక్షణ కంకణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మే 9: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో ఉన్న మహాప్రసాదాల తయారీ, నిత్యాన్నదాన పథకం భవనాలను కొండ కిందికి మార్చటం సరికాదని శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామి అన్నారు. ఇంద్రకీలాద్రిపై సోమవారం సాయంత్రం నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మవారి పల్లకీ సేవ, రక్షణ కంకణాల విక్రయం కార్యక్రమాలకు స్వామీజీ ప్రారంభించారు.
ఈసందర్భంగా శ్రీ స్వరూపనంద సరస్వతీ స్వామీజీ విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని అభివృద్ధి చేయటం మంచిపనే కాని ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్నింటినీ కొండ కిందికి తీసుకురావాలని అధికారులు భావించటం మంచిది కాదన్నారు. అమ్మవారి మహాప్రసాదాలు, ఉచిత అన్నదాన పథకం వంటి కార్యక్రమాలు కొండ పైనే నిర్వహించాలితప్ప ఎలాంటి పరిస్థితుల్లోనూ కొండ కిందికి తరలించరాదని స్వామీజీ సూచించారు. కొన్ని కార్యక్రమాలు విధిగా అమ్మవారి చెంతనే జరగాలని, వాటిని కదిలించే ప్రయత్నాలు చేయటం ఎవరికీ మంచిది కాదని విలేఖరుల ప్రశ్నకు బదులుగా చెప్పారు. అభివృద్ధి పనులు కూడా ఒక క్రమపద్ధతిలో జరగాలి తప్ప ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు చేసుకుపోకూడదని స్వామీజీ హితవు పలికారు.

చిత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రక్షణ కంకణాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీ