ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ కృష్ణసింగ్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 23: నెల్లూరుకు చెందిన ప్రధాన క్రికెట్ బుకీ కృష్ణసింగ్‌ను ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. ఈ సంఘటనపై జిల్లా పోలీస్ శాఖ స్పష్టత ఇవ్వనప్పటికి విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాత్రి బెంగళూరులో కృష్ణసింగ్‌ను నెల్లూరు 2వ నగర సి ఐ కె.రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ్నుంచి ఆయన్ను శనివారం ఉదయం నెల్లూరుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఒక సాధారణ జూద వ్యసనపరుడిగా ఉన్న కృష్ణసింగ్ ప్రస్తుతం కోట్లకు పడగలెత్తడంతో పాటు కొన్ని సందర్భాల్లో జిల్లాపోలీస్ శాఖను నియంత్రించగలిగే స్థాయికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీగా పి హెచ్ డి రామకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలో జూదం, బెట్టింగ్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించా రు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న అనేక సందర్భాల్లో కృష్ణసింగ్ ద్వారా తాము ఆడుతున్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీనికి తోడు ఇటీవల 2వ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న నగర ప్రముఖులు, రాజకీయ నాయకుల్ని పోలీసులు పట్టుకున్న సందర్భంలో అక్కడ కృష్ణసింగ్ కూడా ఉన్నాడని, అయితే మేడపై నుంచి దూకి పారిపోయాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో 2వ నగర ఇన్స్‌పెక్టర్ రామకృష్ణారెడ్డికి ఎస్పీ రామకృష్ణ చార్జి మెమో జారీ కూడా చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన ఎస్పీ ఎట్టకేలకు కృష్ణసింగ్‌ను పట్టుకోగలిగారు.
వైకాపా నేత కీలక పాత్ర
కృష్ణసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంలో జిల్లాలోని వైకాపాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కీలక పాత్ర పోషించారు. కృష్ణసింగ్‌ను పట్టుకోనిదే నెల్లూరుకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకుని ఉన్న పోలీసుల తాకిడిని తట్టుకోలేక ఏమీ పాలుపోని కృష్ణసింగ్ ప్రజాప్రతినిధులను ఆశ్రయించినప్పటికి ఫలితం కనిపించలేదు. ఇక సింగ్ స్నేహితుడైన సదరు నేత పోలీసులతో మాట్లాడి కృష్ణసింగ్‌ను అప్పగించినట్లు సమాచారం. పోలీసుల నుంచి తప్పించుకొని సోమవారం కోర్టులో లొంగిపోయేందుకు కృష్ణసింగ్ బృందం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు.
విచారణలో ప్రముఖుల పేర్లు వెల్లడి
కృష్ణసింగ్‌ను విచారిస్తున్న పోలీసులకు ఆయన పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించినట్లు తెలిసింది. వీరిలో జిల్లాకు చెందిన పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్పొరేటర్లు కొందరు ఉన్నారు.