ఆంధ్రప్రదేశ్‌

మోదీకి ఆర్థిక సంస్కరణలు ఏమి తెలుసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) 22: బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడు సంవత్సరాలలో దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ విద్యావేత్తకాదు, కేవలం 4వ తరగతి చదివిన ఆయనకు సంస్కరణలు గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. నోట్లరద్దుతో పేద, మధ్య తరగతి వర్గాల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్నారు. జిఎస్‌టి అమలు తరువాత సామాన్యులకు అవసరమైన నిత్యవసర వస్తువులు ధరలు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. కోడిగుడ్డు దగ్గర నుండి దుస్తులు, మందులు ప్రతి వస్తువు ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. ఈ మూడు సంవత్సరాలలో ప్రధానమంత్రి మోదీ అబద్దాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. మోదీ పాలనపై రాజకీయనాయకులు, మేధావులు నోరుమెదపకపోవటం బాధకరమన్నారు. అమరావతి రాజధాని ప్రాంతం శాపానికి గురైన ప్రాంతమన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు తన పూర్తి మద్దతు వుంటుందని ప్రకటించారు. ఏపి డిజిపి నండూరి సాంబశివరావు రాజకీయనాకుడిలా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.