ఆంధ్రప్రదేశ్‌

దళితులపై తప్పిన ‘దేశం’ లెక్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం వేసుకున్న లెక్కలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపిలోని మాలలు కాంగ్రెస్ వైపు, మాదిగలు టిడిపి వైపు.. తెలంగాణలో మాదిగలు టిడిపి, మాలలు కాంగ్రెస్ వైపు ఉండేవారు. విభజన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన మాల వర్గ నేతలు ప్రత్యామ్నాయంగా టిడిపిలో చేరారు. టిడిపి నాయకత్వం కూడా ఏపిలో మాదిగ సంఖ్యాబలం తక్కువ అన్న భావనతో, తొలిసారిగా పార్టీ వైపు మొగ్గుచూపిన మాలలను ఓటు బ్యాంకుగా మలచుకోవాలని నిర్ణయించింది. దానితో సంప్రదాయ మద్దతుదారులయన మాదిగలను పక్కకుపెట్టి గత మూడేళ్లుగా పార్టీ-ప్రభుత్వంలో మాలలకు పెద్దపీట వేస్తూ వచ్చింది. అయితే, తాజాగా వైసీపీ కన్సల్టెంట్ ప్రశాంత్‌కిశోర్ వివిధ ప్రాంతాల్లో చేయిస్తున్న సర్వేలో మాత్రం మాలలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాది నుంచి వచ్చిన టీమ్ లీడరుతోపాటు, తెలుగువారు కూడా పి.కె. బృందాల్లో ఉన్నారు. వీరంతా తొలుత వైసీపీ నేతలతో భేటీ అయి, తర్వాత స్థానిక పరిస్థితులను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మాల వర్గానికి చెందిన నేతలకు టిడిపి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులిస్తున్నప్పటికీ, ఆ వర్గంలో మెజారిటీ శాతం ఇప్పటికీ వైసీపీ వైపే ఉందని ఆ సర్వే ప్రాధమిక నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో తొలి నుంచీ టిడిపికి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న మాదిగలు గుంభనంగా ఉంటున్నట్టు తేలింది. వర్గీకరణపై టిడిపి ప్రభుత్వం వౌనంగా ఉండటంతోపాటు, మాలలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోందంటున్నారు. వైసీపీ సర్వే ప్రాధమిక ఫలితాల బట్టి దళితులపై దేశం నాయకత్వం అంచనాలు తప్పినట్లు స్పష్టమవుతోంది. నిజానికి ఏపిలో మాల-మాదిగ వర్గాల మధ్య తేడా కేవలం నాలుగున్నర లక్షలేనని గతంలో ఓ సర్వే కూడా తేల్చింది. కాగా, పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ బిసి, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు మాత్రం టిడిపి వైపు సానుకూలంగా ఉన్నాయని తేలినట్లు సమాచారం. బిసిలో యాదవ, మత్స్య, నారుూ బ్రాహ్మణ వర్గాలు ఎక్కువగా టిడిపి వైపు మొగ్గుచూపుతున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో మినహా మిగిలిన అన్ని చోట్ల మెజారిటీ రెడ్డి వర్గం వైసీపీ వైపే మొగ్గుచూపుతోంది. నెల్లూరులో మాత్రం ఆ వర్గం చాలా ప్రాంతాల్లో టిడిపినీ సమర్థిస్తోంది. దానికి స్థానిక నేతల ప్రభావం కారణంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో టిడిపిని వ్యతిరేకించిన ముస్లిం వర్గాల్లో ఈసారి స్థానిక నేతల ప్రభావం వల్ల కొద్దిగా ఆ పార్టీ వైపు మొగ్గు కనిపించినప్పటికీ, మెజారిటీ శాతం వైసీపీ వైపే ఉన్నట్లు తేలిందని సమాచారం.
కాగా కాపుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 40 సంవత్సరాల లోపు వయసున్న వారిలో మెజారిటీ శాతం వైసీపీ వైపు, యువకుల్లో ఎక్కువ శాతం మంది జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. అయితే మొదటి నుంచి టిడిపి వైపు మొగ్గు చూపుతున్న కాపుల వైఖరిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. గోదావరి జిల్లాల్లో మెజారిటీ బీసీలు టిడిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు అందులో తేలినట్లు సమాచారం. అదే సమయంలో ఆరేడు జిల్లాల్లో మెజారిటీ జనాభా ఉన్న బలిజలు మాత్రం ఇప్పటికి ఎక్కువగా టిడిపి వైపే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. అయితే ఈ సర్వే బృందాలు ఇంకా పూర్తిస్థాయి నివేదికలేవీ ఇవ్వలేదని వైకాపా వర్గాలు చెబుతున్నాయ.