ఆంధ్రప్రదేశ్‌

బాబు-పవన్ భేటీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు-జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ఖరారయింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల సమస్యలను గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వారిని ఆదుకోవాలన్న పవన్ సూచనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడకు వైద్యశాఖ మంత్రి సహా ప్రత్యేక వైద్యబృందాన్ని పంపించారు. దాంతో ప్రస్తుతం అక్కడ 7 ఆర్వో ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా, తాజాగా బాబు నిర్వహించిన సమీక్షలో ఉద్దానం, కనిగిరిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఎన్ని అవసరమైతే అన్ని ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆదేశించారు. దానితోపాటు వారికి 2500 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా, తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కల్యాణ్ సూచనలను గౌరవిస్తుందన్న సానుకూల సంకేతాలు పంపించారు. కాగా, పవన్ గతంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీనల్ విభాగం మెడికల్ చీఫ్ డాక్టర్ జోసెఫ్‌తో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చించి, ఆయన బృందాన్ని శ్రీకాకుళం వచ్చి అధ్యయనం చేయాలని అభ్యర్థించారు. దానికి స్పందించిన జోసెఫ్ బృందం ఈనెల 29,30న ఉద్దానం వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. పవన్ కూడా ఆ బృందంలో చేరనున్నారు. అయితే, జోసెఫ్ బృందం తమ పర్యటన అనంతరం, అక్కడ పరిస్థితులను వివరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావాల్సిన అవసరం ఉందని చెప్పడంతో, ఈనెల 31న పవన్ సారథ్యంలోని డాక్టర్ల బృందం చంద్రబాబునాయుడును కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. ‘చంద్రబాబునాయుడు ప్రభుత్వం పవన్ చేసే విలువైన సూచనలను ఎప్పుడూ గౌరవిస్తోంది. ఆయన మాకు నమ్మకమైన మిత్రుడు. రాజధాని రైతులపై ఆయన చేసే సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, ఎవరూ కోరకపోయినా బాబుగారే స్పందించి కిడ్నీతో బాధ పడేవారికి నెలకు 2500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించార’ని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.