ఆంధ్రప్రదేశ్‌

జగన్.. ఇప్పుడేం చెబుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: గత సంవత్సరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌సిఎఇఆర్) రిపోర్టు ఇచ్చినప్పుడు ఇదే ‘ప్రతిపక్ష’ నాయకుడు జగన్ రాష్ట్రం వెనుకబడిపోతోందంటూ గగ్గోలు పెట్టారు.. రాష్ట్రం విభజన జరిగిన కొత్తలో పాత లెక్కల ఆధారంగా ఇచ్చిన రిపోర్టుపై గందరగోళం సృష్టించారు.. తాజాగా ఇదే సంస్థ ఇచ్చిన సర్వేలో ఏపీ దేశంలోనే గుజరాత్, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో నిలిచిందని చెప్పింది.. ఇప్పుడు ఇదే ప్రతిపక్షం దీనికి ఏం సమాధానం చెబుతుందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశంలోనే ఏపి అభివృద్ధిలో నెం.1 స్థానంలో నిలిచిందని సోమవారం ఒక ప్రకటనలో యనమల వివరించారు. తాజాగా వెలువడిన ఎన్‌సిఎఇఆర్ రిపోర్టు ప్రకారం రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్న విషయం తేటతెల్లమైందని ఆర్ధికమంత్రి వివరించారు. ఇప్పటికైనా ప్రతిపక్షం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలని, అభివృద్ధిని అడ్డుకునే పని మానుకోవాలని, అబద్దాలే జీవితంగా సాగితే విశ్వసనీయత కోల్పోతారని యనమల హితవు పలికారు.