ఆంధ్రప్రదేశ్‌

ఏపి అందరికీ నమూనా కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 24: ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి, అందరికీ నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ ఈ వారం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం స్వయం పోషకం కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 7స్టార్స్ రేటింగ్‌తో ప్రతి గ్రామం పట్టణాలకు దీటుగా అన్ని వసతులతో రూపొందాలన్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాలతో పాటు ప్రతి కుటుంబం నెలకు కనీస రాబడి రూ.10వేలకు చేరుకునేలా అధికార యంత్రాంగం తగిన తోడ్పాటు అందించాలన్నారు. అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 15లోపు వేరుశనగ నాట్లు పూర్తిచేసేలా చూడాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికే 76 శాతం రైతుల ఖాతాల్లో పడిందని, మిగిలింది కూడా త్వరగా జమచేయాలని ఆదేశించారు. ఈ క్రాపింగ్ 72 శాతం పూర్తిచేశారంటూ, 100 శాతం పూర్తి చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల పంపిణీ 42 శాతం మాత్రమే జరిగిందని, మిగిలినవి కూడా వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. పంట రుణాల పంపిణీ లక్ష్యంలో 46 శాతం మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తి ప్రకటించారు. కౌలు రైతులకు రుణ పంపిణీ ముమ్మరం చేయాలన్నారు. 26వ తేదీ వ్యవసాయ రుణాల పంపిణీపై సమీక్షిస్తామంటూ, ఆ లోపునే లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం (నరేగా) కింద 14.61 కోట్ల పని దినాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గొప్ప విషయం అన్నారు. పంట సంజీవని లక్ష్యం 4 లక్షలు కాగా ఇప్పటివరకు 75,500 పంట కుంటల త్వవకం పూర్తయిందని, గ్రౌండ్ అయిన 2,11,350 పంట కుంటలు వెంటనే పూర్తిచేయాలని కోరారు. పంట కుంటల తవ్వకంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. ‘నీరు-ప్రగతి’ ఉద్యమం కింద 90 రోజుల్లో 6.95 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు జరిగాయన్నారు. సిసి రోడ్ల నిర్మాణ లక్ష్యం 6వేల కిలోమీటర్లు కాగా 7,562 కిలోమీటర్ల గ్రౌండ్ చేయడాన్ని అభినందించారు. చిత్తూరు జిల్లాలో ఇజ్రాయెల్ సేద్యం తొలిసారిగా ప్రారంభించిన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రూ.25 కోట్ల విలువైన కూరగాయలను 500 ఎకరాల్లో పండిస్తున్నారని, టిటిడి ఇక్కడి నుంచే రూ.4 కోట్ల విలువైన కూరగాయలు కొంటోందని గుర్తుచేశారు. రైతులను క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ గ్రామాలకు తీసుకెళ్లాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిని పెట్టుకుని అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద గ్రౌండ్ అయిన 2 లక్షల ఇళ్లలో 60వేలు పూర్తయ్యాయని, మిగిలిన లక్షా 40వేల ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలన్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో పంటకుంటలు, చెక్ డ్యాముల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నరేగా నిధుల ఏకీకరణ (కన్వర్జన్స్)కు ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధుల కన్వర్జన్స్‌పై జిల్లా యంత్రాంగంతో అవగాహన పెరగాలన్నారు.