ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి 2.25లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 24:ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 2,25,245 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఆమోదం తెలిపారు. ఆంధ్రాతో సహా దేశంలోని పలు రాష్ట్రాలకు ఇళ్ల మంజూరు దస్త్రంపై వెంకయ్యనాయుడు చివరి సంతకం చేశారు. సోమవారం నాడు కేంద్ర పట్టణావృద్ధిశాఖ కార్యలయంలో కేంద్ర గృహనిర్మాణ శాఖ మానిటరింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈసమావేశంలో వివిధ రాష్ట్రాలకు ఇళ్లను మంజూరు చేస్తూ కమిటి ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 4.20లక్షలకు పైగా ఇళ్లను కేంద్రం మంజూరు చెయ్యగా, గృహాల నిర్మాణం కోసం మొత్తం రూ 24,834 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఖర్చు చెయ్యనున్నాయి. ఆంధ్రాకు కేటాయించిన 2.25లక్షలకు పైగా ఇళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.14,140.44కోట్ల నిధులను సమకూరుస్తాయి. గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.95లక్షలకు పైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనంతవురానికి 19697, చిత్తూరుకి 7546, తూర్పుగోదావరికి 15966, గుంటూరుకు 32577, కడపకు 14544, కృష్ణా 52986, కర్నూలుకు 10537, నెల్లూరుకి 19940, శ్రీకాకుళంకు 6709, విజయనగరానికి 3692, విశాఖపట్నం 12244, పశ్చిమగోదావరికి 26985 ఇళ్లను జిల్లాల వారీగా కేంద్రం మంజూరు చేసింది