ఆంధ్రప్రదేశ్‌

ఇక అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: ప్రపంచంలోనే మొదటగా వర్చువల్ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ పాఠశాలల్లో నాంది పలికామని, రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం ఉదయం విజయవాడలోని సివిఆర్ మున్సిపల్ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 28 పాఠశాలల్లో 62 తరగతి గదులను డిజిటిలీకరణ చేసే విద్యావాణి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి నగరంలోని 14 పాఠశాలల విద్యార్థులతో కలిసి వర్చువల్ డిజిటిలీకరణ క్లాస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, వేదికపై ఉన్న సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి, విద్యావాణి ప్రాజెక్టు కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే కాలంలో ఏపిలోని ఇళ్లను నాలెడ్జ్ హబ్‌గా తయారుచేయడానికి ఫైబర్ గ్రిడ్ ద్వారా ఒక్కో ఇంటికి 15 ఎంబిపిఎస్ సామర్థ్యంతో 200 రూపాయలతో ఒక కనెక్షన్ ఇస్తామన్నారు. దీని ద్వారా అపరిమిత డేటా అందుబాటులోకి రావటంతోపాటు టివి, ఫోన్ కనెక్షన్లు, ఈ-మెడిసన్, ఈ-లెర్నింగ్, వినోదం వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫైబర్ కూడా డిమాండ్‌ను బట్టి ఇస్తామన్నారు. ఈ మెటీరియల్ ద్వారా వివిధ బోధనాంశాలను విద్యార్థులకు దృశ్య విధానంలో కళ్లకు కట్టినట్టు బోధించగలుగుతారన్నారు. ఇక విద్యార్థులకు తమ తరగతి గదుల్లోనే ఏకరూప బోధన లభిస్తుందన్నారు. మెలూహ టెక్నాలజీస్ సంస్థ రూపొందిస్తున్న విద్యావాణి ప్రాజెక్టు ద్వారా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల కోసం డిజిటల్ ఎడ్యుకేషన్‌పై అవగాహన, శిక్షణ ఇస్తారన్నారు. అంతేకాకుండా విద్యార్థుల కోసం త్రీ-డీ యానిమేటెడ్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఈ బుక్స్, రీడింగ్ మెటీరియల్స్, రివిజన్ కోసం క్లాస్ రూం సిఐటీ మెటీరియల్, ప్రాక్టీస్ క్విజెస్, ప్రశ్నాపత్రాలు, పరీక్షలు, రిపోర్టులు వంటివి అందుబాటులోకి రానున్నాయన్నారు. ఉపాధ్యాయుడు అందించే బోధనాంశాలను ఏకకాలంలో 28 పాఠశాలల్లోని 62 తరగతి గదుల్లో గల విద్యార్థులందరూ డిజిటల్ బోర్డుపై ఆయా పాఠ్యాంశాలను వినగలుగుతారు, చూడగలుగుతారు, గ్రహించగలుగుతారన్నారు. కంటెంట్ క్లౌడ్‌లో పెడితే క్లాస్‌రూంలో చదువుకోవచ్చు, క్లాసుకు రానప్పుడు కూడా ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అని చెప్పారు. వీలును బట్టి ఏ సిలబస్ పోర్షన్‌కు ఆ సిలబస్ పోర్షన్‌ను చదువుకోవచ్చు అన్నారు. జీవితం అనేది ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలని, దానివలన మార్పును గ్రహించగలుగుతామన్నారు. దేనిని ఎట్లా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకోవాలని అట్లా చేయటంలో ఉపాధ్యాయులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారన్నారు. సిసి టీవి కెమెరాల వలన నేరస్థులను పట్టుకోవటం, ట్రాఫిక్, తదితరమైన వాటిని గుర్తించి చర్యలు తీసుకోగలుగుతామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లు పెట్టటం వలన విద్యార్థులు తమ భవిష్యత్‌కు పునాదులు వేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. కొత్త సాంకేతిక విధానాల వల్ల వాటికి ఎడిక్ట్ అవుతున్నారని, దానివలన ప్రజల జీవితాల్లో చాలా దుష్ప్రభావాలు ఉంటాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. రాబోయే కాలంలో ఏపిని నాలెడ్జ్ హబ్‌గా చేసి వినూత్న ప్రయోగాలు ఇక్కడ నుంచే జరిగేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. ఈ విద్యావాణి లాంటి ప్రాజెక్టు ఆవిష్కరణ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన సివిఆర్ మున్సిపల్ స్కూల్‌లో జరగటం చాలా ఆనందంగా ఉందన్నారు. చివరిగా ముఖ్యమంత్రి సివిఆర్ స్కూల్ నుంచి ఎవరైనా మాట్లాడాలని కోరగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఇలాంటి మంచి ప్రాజెక్టుకు మా స్కూల్ వేదికగా నిలవటం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ విద్యార్థులు వరలక్ష్మి, తదితరులు మాట్లాడుతూ ఏఎఫ్‌సి (్ఫండేషన్ కోర్సు) లాంటి కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని దీనికి మున్సిపల్ మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విద్యావాణి ప్రాజెక్టు కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.