ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర కేబినెట్‌లోకి కంభంపాటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జల్రై 24: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు డాక్టర్ కంభంపాటి హరిబాబును కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం.. ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబుకు, త్వరలో జరగనున్న కేంద్ర క్యాబినెట్ విస్తరణలో కేంద్ర సహాయమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, వెంకయ్య దన్నుతో నాయకత్వం ఆయననే కొనసాగిస్తూ వస్తోంది. ఒక దశలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, లేదా కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందిస్తారన్న ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. అయితే వారిని అడ్డుకునేందుకు ఓ వర్గం వ్యూహాత్మకంగా, రాయలసీమ నేతలను తెరపైకి తీసుకురావడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక హరిబాబునే కొనసాగించారు. త్వరలో జరగనున్న కేంద్ర క్యాబినెట్ విస్తరణలో హరిబాబుకు అవకాశం ఇస్తారని, ఆ తర్వాతనే రాష్ట్ర పార్టీ విస్తరణపై జాతీయ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తుందని ఓ సీనియర్ నేత వెల్లడించారు. క్యాబినెట్ విస్తరణ తర్వాత ఏపిలో పార్టీ ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యాలయ వ్యవహారాలలో కీలక మార్పులు తీసుకువస్తారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీతోపాటు, మెజారిటీ జిల్లా కమిటీలు, రాష్ట్ర కార్యాలయ వ్యవహారాలన్నీ వెంకయ్యనాయుడు విధేయులే నిర్దేశిస్తున్నారని, విస్తరణ తర్వాత ఆ పరిస్థితిలో పూర్తి మార్పులు వస్తాయని జోస్యం చెబుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్‌ను కూడా తొలగించి, మరొకరిని నియమించనున్నారు. ఆయన ఇప్పటికే యుపిలో మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి ఎవరు ఇన్చార్జిగా వచ్చినా వారిని ఒక వర్గం, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మిత్రులుగా మార్చడంతోపాటు.. సీఎం వద్దకు తీసుకువెళుతున్నారని, ఈ విషయంలో తమ పార్టీకే చెందిన ఓ మంత్రి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, కఠినంగా వ్యవహరించే నేతకు ఇన్చార్జికి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.