ఆంధ్రప్రదేశ్‌

దేశానికే ఉత్తమం చంద్రన్న బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: ‘చందన్న బీమా’ పథకం లబ్ధిదారులెవరైనా మరణిస్తే 14వ రోజు సంతాప కార్యక్రమం నిర్వహించి బీమా పరిహారం మొత్తాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కార్మికశాఖ అధికారులు, సెర్ప్ అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు ఎంతో బాధతో ఉంటారని, ధైర్యం నింపే నాలుగు మాటలు చెప్పి వారికి సాయం అందిస్తే అది వారికి గొప్ప ఊరట కలిగిస్తుందన్నారు. చంద్రన్న బీమా పథకం సభ్యులు మరణించినప్పుడు పెద్దకర్మ నాటికి ఆ గ్రామంలోని జన్మభూమి కమిటీ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున సంతాప సందేశం అందించి తుది పరిహారం అందించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విధంగా 14 రోజుల్లో పరిహారం అందజేయడానికి బీమా సంస్థలు అంగీకరించాయి. ఇప్పటివరకు చంద్రన్న బీమా పథకం కింద 64,677 క్లయిమ్స్ రాగా, అందులో 56,779 క్లయిమ్‌లకు పరిహారం అందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రన్న బీమా పరిహారాలు మొత్తం పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిహారానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా సంబంధిత అనుమతి పత్రాలన్నీ రెండు, మూడు రోజుల్లో జారీచేసేలా వివిధ ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణ ధ్రువీకరణ పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు అందించడంలో గతంలో మాదిరిగా జాప్యం జరగడానికి వీల్లేదని అన్నారు. ఇటీవల కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకానికి ప్రశంసలు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2.13 కోట్ల మందితో అతి పెద్ద సంఖ్యలో కార్మికులను బీమా పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీయేనని ఆ సమావేశంలో పాల్గొన్నవారంతా అభినందించారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో బీమా ప్రయోజనం పొందుతున్న కార్మికుల సంఖ్య 30, 40 లక్షలకు మించి లేదని, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసలు ఈ తరహా బీమా పథకం లేనే లేదని చెప్పారు. పెద్ద సంఖ్యలో కార్మిక కుటుంబాలకు ప్రయోజనం అందిస్తూ ఏపి మిగిలిన రాష్ట్రాలకు ఉత్తమ నమూనాగా నిలిచిందని పేర్కొన్నట్టు చెప్పారు. 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు నివాసాలు నిర్మించే యోచన గృహ నిర్మాణ సంస్థతో చర్చించి తగిన ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటిఐలకు జవసత్వాలు కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా 29 ఐటిఐలకు కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.