ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబులా శుష్కవాగ్దానాలు చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 27: రాష్ట్ర ప్రజల ముందు నేడు రెండే దారులు ఉన్నాయి.. అన్యాయం, అరాచకం, అవినీతి దారిలో వెళ్తున్న చంద్రబాబు దుర్మార్గం ఒకటైతే.. ప్రతి నిరుపేదకు విద్య, వైద్యం అందించి, ఆర్థికంగా వెన్నంటి ఉండే రాజన్న సన్మార్గం మరోకటని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పార్టీ కండువాను కప్పి వైకాపాలోకి సాదరంగా ఆహ్వానించిన ఆయన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం నిరసన తెలిపేందుకు సైతం చంద్రబాబు పాలనలో అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజలు రాజన్న దారి చూపిన సన్మార్గంలో వైసిపితో కలసి నడిచేందుకు సన్నద్ధులై ఉన్నారని ప్రకటించారు. చంద్రబాబు పుట్టుకలోనే 420 ఉందని, అందుకనే రాష్ట్రంలో 144 సెక్షన్ విధించి అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికార మదంతో ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకుని బాబు పాలన చేస్తున్నారని, నాడు అప్యాయత, అనురాగంతో వైఎస్ సుపరిపాలనకు దారి చూపించారని చెప్పారు.
తెదేపా మూడేళ్ల అరాచక పాలనను గొంతెత్తి ప్రశ్నిస్తున్నది వైకాపా ఒక్కటేనన్న ఆయన చంద్రబాబు వెయ్యి కుట్రలు పన్నిన్నా తట్టుకునే గుండె ధైర్యం మనకుందని చెప్పారు. రానున్న రోజుల్లో రాజన్న కలలు గన్న రాజ్యం రానున్నదన్నారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలో బాబుకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. మామ ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పోడిచిన నాటి నుండి బాబు ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పి నమ్మించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఒకసారి నమ్మి మోసపోయిన రాష్ట్ర ప్రజలు మరోసారి బాబు మాటలను విని మళ్లీ మోసపోయే స్థితిలో లేరన్నారు. మద్యం దుకాణాల నుంచి, గుడి భూములు, జెన్కో కాంట్రాక్టులు, ఇసుక దందాలు, రాజధాని అవినీతి వంచి వాటిలో లక్షల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దోరికి పోయి, పక్కరాష్ట్రం సిఎం కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చే వరకు గుర్తుకు రాని ముస్లింలను ప్రలోభ పెట్టేందుకు నంద్యాల ఎన్నికల దృష్యా ఇఫ్తార్ విందులు, నజరానాలు, వాగ్దానాలపై వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చేయగలిగే వాటినే ప్రకటిస్తున్నామని తెలిపిన ఆయన చెప్పిన వాటిని తప్పకుండా నెరవేర్చి తీరుతామని హామీ ఇచ్చారు. రాజకీయ నేతల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించినట్లు వెల్లడించారు. వైకాపా నాయకులు కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్ తోపాటు పలువురు నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు.

చిత్రం.. జగన్ సమక్షంలో వైకాపాలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు