ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 12 బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో 12 బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలుర కోసం ఆరు, బాలికల కోసం ఆరు ఏర్పాటు చేయనున్నారు. బాలుర కోసం సింహాచలం (విశాఖ జిల్లా), మోపిదేవి (కృష్ణా), నిజాంపట్నం (గుంటూరు), కోట, దొరవారిసత్రం (నెల్లూరు), లేపాక్షి (అనంతపురము)లో, బాలికల కోసం నెల్లిమర్ల (విజయనగరం), తానాం (విశాఖ), తేకులోడు (అనంతపురము), నందలూరు (కడప), ఆరేకాల్, నీరవాడ (కర్నూలు)ల్లో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విభజన తరువాత బిసి గురుకుల పాఠశాలలు 32 పని చేస్తున్నాయి. వీటిలో 27 పాఠశాలల్లో 10వ తరగతి వరకూ ఉంది. జూనియర్ కళాశాలలు లేకపోవడంతో 10వ తరగతి తరువాత చాలా మంది విద్యార్థులు తదుపరి చదువును కొనసాగించేందుకు వీలు లేకుండా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి గురుకుల జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంపిసి, బైపిసి, సిఇసి, ఎంఇసి గ్రూపులతో కళాశాలలను ప్రారంభించనున్నారు.