ఆంధ్రప్రదేశ్‌

డిప్యూటీ కలెక్టర్‌గా సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: ఒలింపిక్స్ పతక విజేత పివి సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ సంబంధిత ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అందచేశారు. వెలగపూడి సచివాలయంలో సింధుకు ఉద్యోగ నియామక పత్రం అందచేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గ్రూప్-1 అధికారిగా నియమితురాలైన సింధు.. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. బ్యాడ్మింటన్ కెరీర్‌పై తన దృష్టిని కేంద్రీకరించానన్నారు. మరిన్ని విజయాలు సాధించాలని సిఎం సూచించారని తెలిపారు. క్రీడలకు సిఎం ప్రోత్సాహం ఎక్కువగా ఉందన్నారు. 30 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చిత్రం.. పివి సింధుకు నియామక పత్రం అందచేస్తున్న ముఖ్యమంత్రి