ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుబంధ ఫీజు 300 శాతం పెంపుపై హైకోర్టు ఆశ్చర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల పరిస్థితి నేటికీ అగమ్యగోచరంలా కన్పిస్తున్నది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే అనుబంధం కోసం ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం ఒకేసారి 300 శాతం పెంచడాన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం గత నాలుగు మాసాలుగా తీవ్రంగా నిరసిస్తూ వస్తున్నది. అయితే బోర్డు మాత్రం పట్టుదలతో అనుబంధ ఫీజు చెల్లించని కళాశాలల్లో ప్రథమ సంవత్సర విద్యార్థుల అడ్మిషన్లను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం వాదోపవాదాలు జరిగాయి. అనుబంధ ఫీజును ఒకేసారి ఏ ప్రాతిపదికన 300 శాతం పెంచారంటూ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే బోర్డు న్యాయవాది దీనికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. పెంచిన ఫీజును తగ్గించమని బోర్డు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు, పెంపుతో బోర్డుకు సంబంధం లేదన్నారు. వాస్తవానికి ఈ పెంపు గత విద్యాసంవత్సరం ఆరంభంలోనే అమలు కావాల్సి ఉందన్నారు. ఇలాఉంటే రాష్ట్రం మొత్తంపై మూడువేల ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా బోర్డు విధించిన జరిమానాలు తట్టుకోలేని వెయ్యి కళాశాలలు ఇప్పటివరకు ఫీజు చెల్లించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకుగాను బోర్డు న్యాయవాది కొంత సమయం అడగ్గా న్యాయమూర్తి విచారణను ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా బోర్డు ప్రథమ సంవత్సర విద్యార్థుల అడ్మిషన్లను ఆమోదించకపోవటంతో వారికి ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లు వచ్చేలా కన్పించడం లేదు. తాజాగా ద్వితీయ సంవత్సర విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను కూడా నిలిపివేస్తామని బోర్డు బెదిరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరపనేని సూర్యనారాయణ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈ వివాదంపై ఈనెల 24 తేదీ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈ వివాదంపై ఈనెల 24 తేదీ ఆంధ్రభూమి దినపత్రికలో ప్రముఖంగా వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే.