ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకు ఖాతాల్లోకే రేషన్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: గ్యాస్ వినియోగదారులకు వచ్చే సబ్సిడీ ప్రస్తుతం బ్యాంకుల్లో ఏ విధంగా నేరుగా జమవుతోందో, ఇకపై రేషన్ వినియోగదారులకు వచ్చే సబ్సిడీని కూడా బ్యాంకు ఖాతాల్లోకి జమ కాబోతోంది. గ్యాస్ సబ్సిడీని బ్యాంకులకు బదలాయించడంలో ఇప్పటికే అనేక లోపాలు దొర్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ వినియోగదారుల సబ్సిడీని బ్యాంకులకు బదలాయించడం ఎంతవరూ విజయవంతం అవుతుందో చూడాలి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార, పామోలిన్ నూనె, కిరోసిన్, గోధుమలు, గోధుమ పిండి ఇస్తున్నారు. ఒక కుటుంబంలో ఉన్న సభ్యులను బట్టి మనిషికి 5 కిలోల చొప్పున, గరిష్ఠంగా 5కిలోలు ఇస్తున్నారు. అలాగే పంచదార అర కిలో, గోధుమలు, గోధుమ పిండి కిలో చొప్పున, కిరోసిన్ అయితే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఒక లీటరు, గ్యాస్ కనెక్షన్ లేని వారికి నాలుగు లీటర్లు ఇస్తున్నారు. బియ్యం కిలో రూపాయికి ఇస్తున్నారు. అలాగే పంచదార కిలో 13.50 చొప్పున అరకిలో ఇస్తున్నారు. అలాగే గోధుమలు కిలో ఏడు రూపాయలకు, గోధుమ పిండి కిలో 15 రూపాయలకు, పామోలిన్ ఆయిల్ కిలో 40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పంచదార బహిరంగ మార్కెట్‌లో కిలో 30 నుంచి 35 రూపాయల చొప్పున పలుకుతోంది. దీన్ని రేషన్ దుకాణాల్లో 13.50 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే గోధుమలు బహిరంగ మార్కెట్‌లో 16 నుంచి 17 రూపాయలు పలుకుతోంది. గోధుమ పిండి బహిరంగ మార్కెట్‌లో 30 రూపాయల వరకూ పలుకుతోంది.
ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా పై నిత్యావసర వస్తువులను తీసుకుంటున్న వినియోగదారులు ముందుగా ఆయా వస్తువుల బహిరంగ మార్కెట్ ధరను ముందుగా రేషన్ డీలర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన మొత్తం నుంచి సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి, దాన్ని సదరు వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒకవేళ రేషన్ వినియోగదారులకు బ్యాంకు ఖాతాలు లేకుంటే, కచ్చితంగా ఖాతాను తెరుచుకోవలసి ఉంటుంది.
ఈ నగదు బదలాయింపును అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఏవిధంగా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఈనెల 14న విజయవాడలో సమావేశం కానుంది. ఇందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, సునీత, సుజాత పాల్గొననున్నారు. ఈ నగదు బదలాయింపుపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.