బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లోకి హోండా బిఆర్-వి కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ నూతన మోడల్ హోండా బిఆర్-వి కారును హైదరాబాద్ మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపాక్ట్ ఎస్‌యువి విభాగంలో ఈ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ కార్ల మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటామని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. బుధవారం నాడిక్కడ ఒక హోటల్‌లో కొత్త మోడల్ బిఆర్-విని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కొత్త కారును ఎపి, తెలంగాణ మార్కెట్లో ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కారు పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో లభిస్తుందని అన్నారు. బీఆర్-వి ఇతర యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు వివిధ వేరియంట్స్‌లో స్టాండర్డ్ ఆఫరింగ్‌గా డ్యూయల్ ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్ బ్యాగ్స్‌తో లభిస్తుందని ఆయన వెల్లడించారు. కారు లోపల హైలీ వర్సటైల్ 3 రో ప్రీమియం ఇంటీరియర్స్ కలిగి ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా బీఆర్-వి కస్టమర్లందరికీ స్టాండర్డ్ వాల్యూగా 3 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతోపాటు మరో రెండేళ్లు ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా అందిస్తున్నట్లు చెప్పారు.

సుబ్రతా రాయ్ పెరోల్ గడువు పొడిగింప్పు

న్యూఢిల్లీ, మే 11: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ పెరోల్ గడువును సుప్రీం కోర్టు బుధవారం పొడిగించింది. జూలై 11వరకు పొడిగిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్, జస్టిస్ ఎఆర్ దవే, జస్టిస్ ఎకె సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. సుబ్రతా రాయ్ తల్లి మృతి చెందిన నేపథ్యంలో ఈ నెల 6న రాయ్‌తోపాటు సహారా గ్రూప్ డైరెక్టర్ అశోక్ రాయ్ చౌధరికి నాలుగు వారాల పరోల్‌ను అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసినది తెలిసిందే. ఈ క్రమంలో వీరిరువురి పెరోల్‌ను జూలై 11వరకు సుప్రీం పొడిగించింది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు పెద్ద ఎత్తున నిధులను సేకరించాయన్న కేసులో సుబ్రతా రాయ్ 2014 మార్చి 4 నుంచి తీహార్ జైళ్లోనే ఉంటున్నది తెలిసిందే. ఈ క్రమంలో మదుపరుల నుంచి తీసుకున్న మొత్తం సొమ్మును వడ్డీతోసహా చెల్లించాలన్న మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, కోర్టు ఆదేశాలపై చిత్తశుద్ధిని కనబరిచేలా జూలై 11లోగా సెబీకి 200 కోట్ల రూపాయల డిపాజిట్‌ను సమర్పించాలని సహారాకు ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పొందడానికి ఇంతకుముందు సూచించిన 5,000 కోట్ల రూపాయల నగదు, 5,000 కోట్ల రూపాయల బ్యాంక్ పూచీకత్తు కోసం ఆస్తుల అమ్మకానికి ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చని రాయ్‌కి సుప్రీం అనుమతిచ్చింది. పోలీసుల పర్యవేక్షణలో, దేశం లోపలే ఇదంతా జరగాలంది.

పెట్టుబడులకు ఢోకా లేదు: దాస్
న్యూఢిల్లీ, మే 11: విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలోనే భారత ఆర్థిక మూలాలు ఉన్నాయన్న బలమైన విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులపై వచ్చే ఏడాది నుంచి పన్నులు వేస్తామని మంగళవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినది తెలిసిందే. ఆ దేశంతో ఉన్న డిటిఎసి ఒప్పందాన్ని ఈ మేరకు సవరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇక్కడ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, విదేశీ పెట్టుబడులు ఇక ముందూ వస్తాయని అన్నారు.