ఆంధ్రప్రదేశ్‌

హోదాపై దాటవేతకే పార్లమెంట్ వాయిదా: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 12: రాష్ట్ర విభజన నేపధ్యంలో ప్రత్యేక హోదా కల్పించాల్సిన్న ప్రజల మాటలను ప్రధాని మాట్లాడడు, వెంకయ్యనాయుడు వినడు, చంద్రబాబు నాయుడు చూడడని వీరి ముగ్గురు వైఖరి మూడు కోతుల తీరులా తయారైయ్యారని సి పి ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవా చేశారు. గురువారం తిరుపతిలోని సి పి ఐ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్‌లో చర్చించాల్సివస్తుందనే భయంతోనే కేంద్రం పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసేందుకు కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకహోదాపై చర్చించడానికి బిజెపి ఇష్టపడటం లేదని, అందుకే సభ్యులు లేరని వాయిదావేయడానికి కేంద్రం డొంకతిరుగుడు విధానాన్ని అవలంభిస్తోందని నిప్పులు చెరిగారు. ఏపికి ప్రత్యేకహోదాపై గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తే ఎక్కడ బంధం తెగిపోతుందోనని సి ఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నట్లు కనపడుతోందన్నారు. అందుకే ప్రత్యేకహోదా కావాలనికాని, వద్దని కాని చంద్రబాబు నేటికి కేంద్రంతో స్పష్టం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.