ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం కాగడాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదాకు చెల్లు చీటి పాడిన కేంద్రంలోని అధికార పక్షం బిజెపితో తమ దోస్తి కొనసాగిస్తారో లేక ఆంధ్రుల పక్షాన నిలిచి కయ్యానికి దిగుతారో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలంటూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు సవాల్ చేశారు. ప్రత్యేక హోదా కోసం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక అయోధ్యనగర్ నుంచి శాంతినగర్ వరకు కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఆనాడు కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక హోదాను ఆమోదించగా రెండేళ్లు గడుస్తున్నప్పటికీ చంద్రబాబుగాని కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులుగాని చివరకు తెదేపా ఎంపిలుగాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురానందుకు ఆంధ్రులు సిగ్గుపడుతున్నారన్నారు. చివరకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు సభలోకి రాకుండా ఏకంగా సమావేశాలనే ముగించారన్నారు. వచ్చే సమావేశాల నాటికి రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గుతుందనే ఆలోచనల్లోనే బిజెపి తెలుగుదేశం కలిసి కుట్రపన్నాయన్నారు. ఏదిఏమైనా ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకుగాను వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి చెందిన నిర్మలా సీతారామన్ లేదా వెంకయ్య నాయుడులకు ఏ ఒక్కరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించకూడదన్నారు. నిరసన కాగడాల ప్రదర్శనలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నరసింహరావు, ఎస్‌సి సెల్ రాష్ట్ర కన్వీనర్ పేటేటి రాజశేఖర్, లీగల్ సెల్ నగర చైర్మన్ తల్లా ప్రగడ సుబ్బారావు, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు శర్వాణి మూర్తి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం కాగడాల ప్రదర్శనలో మాట్లాడుతున్న మల్లాది విష్ణు