ఆంధ్రప్రదేశ్‌

అమరావతి చూసొద్దాం రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: రాజధాని ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి చూపించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఈ బస్సు రాజధాని ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలను, దేవాలయాలను పర్యాటకులకు చూపించబోతోంది. ప్రతి రోజు ఈ బస్సు ఉదయం విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ముందు ఉండవల్లి గుహలు, అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శన ఉంటుంది. ఆ తరువాత ఉద్దండరాయపాలెంలోని రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి తీసుకువెళతారు. అక్కడి నుంచి వెలగపూడిలో సిద్ధమవుతున్న తాత్కాలిక సచివాలయ భవానాన్ని చూపిస్తారు. ఆ తరువాత అమరావతిలోని అమరలింగేశ్వస్వామి దర్శనం, ధ్యాన బుద్ద ప్రాంగణాన్ని చూపిస్తారు. అక్కడే ఉన్న బుద్ద మ్యూజియం, కాలచక్ర మ్యూజియంను చూపిస్తారు. చివరిగా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఈ అమరావతి రాజధాని యాత్రకు వచ్చే పెద్దలకు 400 రూపాయలు, పిల్లలకు 300 రూపాయలు చార్జి వసూలు చేయనుంది.