ఆంధ్రప్రదేశ్‌

సైబర్ నేరం కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఆగస్టు 12: సైబర్ నేరంపై విచారణకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం కృష్ణాజిల్లా చల్లపల్లి వచ్చారు. నైజీరియన్ ఫ్రాడ్‌గా పిలిచే ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి చల్లపల్లి మండలం రాముడుపాలెం దళితవాడకు చెందిన మాతంగి కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకువెళ్లారు. రెండు కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి కృష్ణమోహన్ బ్యాంక్ ఎకౌంట్ ద్వారా కొంత నగదు లావాదేవీలు జరగడం, స్నేహితులతో కలిసి ఢిల్లీలో కొన్ని రోజులు గడపటం వంటి ఆధారాలతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ సైబర్ నేరంలో ఉండగా ముంబైకి చెందిన వ్యక్తితో స్నేహం కారణంగా కృష్ణమోహన్ బ్యాంక్ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుండి క్రైం బ్రాంచ్ ఎస్‌ఐ, మరో ఇద్దరు సిబ్బంది చల్లపల్లి వచ్చి స్థానిక పోలీసులతో కలిసి కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చల్లపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వక సమాచారం అందించి మచిలీపట్నం కోర్టులో హాజరుపరిచారు.

చిత్రం.. లావాదేవీలు నడిపిన కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్న దృశ్యం