ఆంధ్రప్రదేశ్‌

జలయజ్ఞం మూటలతోనే రాజ్యసభ సీటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 14: జలయజ్ఞంలో దోపిడీ చేసిన మూటలు ఢిల్లీకి మోసినందుకు మొదటిసారి కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ సభ్యత్వం వచ్చిందని, రెండోసారి రాజ్యసభ సీటు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలపై తీసుకున్న నిర్ణయాన్ని తొక్కిపట్టి రాష్టప్రతికి పంపామని చెప్పడంతో వచ్చిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక జలవనరులశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కెవిపి రామచంద్రరావు కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. ఢిల్లీ వేదికగా కపట నాటకాలకు తెరలేపి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారని, దీనివల్ల పక్క రాష్ట్రాలకు సమాచారం అందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇది చాలదన్నట్టు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారన్నారు. ఇలా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలలో చెస్తే రోడ్డు మీద కూడా తిరగనియ్యరన్నారు. ఢిల్లీలో జర్నలిస్టులు కూడా ఈయన ప్రవర్తన చూసి ప్రశ్నించారని, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా వెళుతుంటే ఇలా అడ్డుకోవడం సరికాదని జర్నలిస్ట్ మిత్రులు ప్రశ్నించడం, రాష్ట్రంపై వారి అభిమానానికి నిదర్శనమన్నారు. 10 సంవత్సరాల పాటు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారన్నా. పోలవరాన్ని మీరు అధికారంలో ఉండగా పూర్తిచేస్తే మీకు సన్మానం చేస్తామని చంద్రబాబునాయుడు ఆనాడే చెప్పినా మీ అసమర్థత, జలదోపిడీతో పూర్తిచేయకపోయారన్నారు. మీరు చేయలేని పని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో 7కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పనులు చేస్తే మీకు ఎగతాళిగా ఉందని, దానిపై వ్యంగ్యంగా ఉత్తరాలు రాస్తూ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడం మీ చేతగానితనాన్ని బయటపెడుతుందన్నారు. మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఢిల్లీకి మూటలు మోయడంలో దిట్ట అయిన కెవిపిని అక్రమాస్తుల కేసులో ఎ-1 నిందితుడు జగన్, ఎ-2 నిందితుడిగా విజయసాయిరెడ్డి తరువాత ఎ-3 నిందితుడిగా పెట్టాలన్నారు. కాంగ్రెస్‌లో ఉండి జగన్ ఏజెంటుగా పనిచేస్తూ నెలకొక్కరిని వైసిపి పార్టీలోకి పంపడమే ధ్యేయంగా పనిచేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడితే త్వరగా పూర్తవుతుందని ఆనాటి నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా కేంద్రానికి రిపోర్టు ఇవ్వడం వల్ల బాధ్యతలు మనకు ఇచ్చారన్నారు. అంతేగాని నువ్వు, నేను అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పనుల బాధ్యత అప్పగించలేదన్నారు. దేశంలో 100 జాతీయ ప్రాజెక్టులు ఉంటే 15 ప్రాజెక్టుల పనులు కూడా ఇంత స్పీడుగా జరగడం లేదన్నారు. పోలవరం అథారిటీ ద్వారా ఆర్థికశాఖకు, నాబార్డ్‌కి 3,600 కోట్ల మేరకు చేసిన పనుల వివరాలు పంపించామన్నారు. పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు పరిశీలనకు వస్తుందని, అంతేకాని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు కాదన్నారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను పరిశీలిస్తోందని, దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం పురుషోత్తపట్నం రెండు పంపుల ద్వారా లెఫ్ కెనాల్‌కు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారన్నారు.