ఆంధ్రప్రదేశ్‌

బుల్లెట్‌ప్రూఫ్.. టెక్నాలజీ.. గ్రీనరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 14: రాష్ట్ర పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో తాత్కాలిక డిజిపి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. పూర్తి స్థాయిలో కార్యాలయం హైదరాబాద్ నుంచి తరలిరాలేదు. దీంతో డిజిపి విజయవాడలోనే ఉంటూ పోలీసు పాలనా కార్యకలాపాలు చేస్తున్నా.. సిబ్బంది, సిఐడి, ఇతర ముఖ్య కార్యాలయాలు మాత్రం హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటుకోసం ప్రభుత్వం స్థలం, నిధులు, అనుమతి మంజూరు చేసింది. మంగళగిరి ఏపిఎస్పీ ఆరో బెటాలియన్ ప్రదేశంలో పోలీసు హెడ్ క్వార్టర్స్ అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ఈనెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. భవన నిర్మాణం పూర్తయిన దరిమిలా సోమవారం డిజిపి సాంబశివరావు హెడ్ క్వార్టర్స్‌ను సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులతో ఆయన మాటా మంతీ జరిపి ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలు బహూకరించారు. సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో లక్షా పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్మాణం జరుపుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో హోం మంత్రి చిన రాజప్ప పోలీసు హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణానికి భూమిపూజ జరిపి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత భవన నిర్మాణం శరవేగంతో పనులు పూర్తి చేసుకుని కేవలం పది మాసాల్లోనే ప్రారంభానికి సిద్ధమైంది, ఈభవనంలో డిజిపి కార్యాలయంతోపాటు సిఐడి ప్రధాన కార్యాలయం కూడా కొలువుదీరింది. సుమారు 40వేల చదరపు అడుగుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోరు, మొదటి అంతస్తు సిఐడికి కేటాయింపు జరిగింది. అదేవిధంగా ప్రోవిజెన్ అండ్ లాజిస్టిక్స్ (పి అండ్ ఎల్), పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ట్రైనింగ్ హెడ్ కార్యాలయం, లా అండ్ ఆర్డర్ అదనపు డిజి, టెక్నికల్ సర్వీసెస్ తదితర ప్రధాన విభాగాలకు రెండు, మూడు అంతస్తులు కేటాయించారు. ఇక నాలుగు, ఐదో అంతస్తులో డిజిపి కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. లిఫ్టుతో సహా ఏ విభాగంలోకి వెళ్లాలన్నా.. మెట్ల ద్వారా అంతస్తుల్లోకి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్ విధానం వినియోగించాల్సి ఉంటుంది. వేలిముద్రతోనే ప్రవేశం ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ చాంబర్లలోకి వెళ్ళే మార్గంలో ఇరువైపులా గోడలకు ముఖ్యమంత్రి ముఖ చిత్రం, ఇంగ్లీషులో మంచి సూక్తలతో కూడిన బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక డిజిపి కార్యాలయం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మించారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాలంటే భవనం వెనుక వైపు ఇంకుడు గుంట మాదిరిగా ఓ పెద్ద ట్యాంకు నిర్మించారు. వెనుక ఉన్న కొండపైభాగం నుంచి వచ్చి పడే వర్షపు నీటి ధార ఈ ట్యాంకులో వచ్చి చేరడంతోపాటు, వీటిని వాడకానికి వినియోగించుకునే వీలుగా రూపొందించడం విశేషం. ప్రధానంగా భవనం ప్రవేశానికి ముందు ఎకరం స్థలంలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ అద్భుతమైన గ్రీనరీ ఏర్పాటు చేశారు. విశేషమేమిటంటే భవనం నిర్మాణం కోసం అక్కడ అంతకుముందు ఉన్న చెట్టు తొలిగించకుండా అవసరం మేరకు కొన్ని చెట్లు, మొక్కలు వేర్లతో సహా పెకిలించి వాటిని తిరిగి ‘రీ ప్లాంటింగ్’ చేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

చిత్రం.. ప్రారంభానికి సిద్ధమైన రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం