ఆంధ్రప్రదేశ్‌

బాబూ నీ బండారం బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అడగలేదని, కనీసం లేఖ కూడా రాయలేదని బిజెపి కేంద్ర నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా టిడిపిలో చలనం లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇకనైనా నాటకాలు మాని వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దాసోహమయ్యారన్నారు. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. పార్లమెంటు వేదికపై ఇచ్చిన హామీకి న్యాయబద్ధత ఉంటుందన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమైతే చేయవచ్చని, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో బిజెపి కూడా భాగస్వామి అన్నారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుందామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. హోదా సంజీవని కాదని చెప్పి ఆంధ్ర అభివృద్ధిపై నీళ్లు పోశారన్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా జరిగిన సదస్సులో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రస్తావించలేదని ఆయన గుర్తు చేశారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిలో చంద్రబాబుకు చెందిన సంస్థ డైరెక్టర్‌పేరు ఉందని, పనామా పత్రాల్లో వెల్లడైందని, దీనిని బట్టి చూస్తే ఈ పత్రాల్లో చంద్రబాబు పేరు ఉన్నట్లు త్వరలోనే బయటపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించేందుకు జగన్ ఈ నెల 16నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.