ఆంధ్రప్రదేశ్‌

లిఖిత పూర్వక ఆదేశాలున్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 14: శాంతియుతంగా పాదయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్న తనను గత 20రోజులుగా గృహనిర్బంధంలో ఉంచారని, ఇలా చేయడానికి మీ వద్ద లిఖితపూర్వకమైన ఆదేశాలున్నాయా? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోలీసులను ప్రశ్నించారు. ఏ వ్యక్తినైనా చట్టప్రకారం 24గంటలకు మించి నిర్బంధించరాదని, అయితే తనను 20రోజులుగా గృహనిర్బంధంలో ఉంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం పాదయాత్రకు యథావిధిగా కాపు జెఎసి నేతలతో కలిసి బయటకు వెళ్లడానికి ముద్రగడ ప్రయత్నించారు. దీంతో పోలీసుల ముద్రగడ సహా జెఎసి నేతలను అడ్డుకున్నారు. అక్రమ గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా కాపు జెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముద్రగడ పోలీసులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరే సమస్యా లేనట్టు కాపులను కాపలా కాయడానికే పోలీసులు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలైనా కాపులకు స్వాతంత్య్రం రాలేదని వ్యాఖ్యానించారు. జూలై 26న అమరావతికి పాదయాత్ర ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారని, సుమారు 20రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచారని, ఇంకా ఎంతకాలం నిర్బంధంలో ఉంచుతారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటువంటి గృహ నిర్బంధాలకు లిఖిత పూర్వక ఆదేశాలుండాలని, మీవద్ద ఏ విధమైన ఆదేశాలున్నాయంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒక వ్యక్తిని 24 గంటలు మించి నిర్బంధంలో ఉంచరాదని మీ చట్టాలే చెబుతున్నాయి కదా? సుప్రీంకోర్టు మార్గదర్శకాలంటూ సమస్యను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఖాళీ కంచాలతో ముద్రగడ ఇంటి ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాపు జెఎసి నాయకులు ఆరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, వివై దాసు తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన పలువురు కాపు ప్రతినిధులు సంఘీభావం తెలియజేశారు.

చిత్రం.. నల్ల జెండాలు చేతబూనిన జెఎసి నేతలతో కలిసి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడ