ఆంధ్రప్రదేశ్‌

నీరే ప్రగతి.. నీరే సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 15: రాష్ట్రానికి నీరే ప్రగతి, సంపద అని, నీళ్ళు లేకపోతే కన్నీళ్ళే మిగులుతాయని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జలాన్ని ప్రతి ఒక్కరు అతి పవిత్రంగా భావించాలని, జలసిరికి హారతులివ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే మూడు నెలల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు రూ.44,140 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఏరువాక కార్యక్రమం రాష్ట్ర ఉత్సవంలా సాగేందుకు ప్రతివొక్కరు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం అనంతరం జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. గోదావరి మహా పుష్కరాల్లో గోదావరికి అఖండ హారతి ఇచ్చామని, తర్వాత కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. కృష్ణా పుష్కరాలకు ముందే పట్టిసీమ పథకాన్ని ప్రజలకు అంకితం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేవరకు నిద్రపోనని చంద్రబాబు అన్నారు. పోలవరం మన చిరకాల స్వప్నమని, పోలవరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరివ్వాలనేది తన ధ్యేయమన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశలో విలీనం చేయడానికి కృషిచేశానన్నారు. 2018కి పోలవరం ప్రాజెక్టు నుండి గ్రావెటీ ద్వారా నీళ్ళు అందించి, 2019కి ఈ ప్రాజెక్ట్ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాయలసీమలో కరువు, కోస్తా జిల్లాల్లో తుపాన్లను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాంగ్రెస్ కాపులను పట్టించుకోలేదు
కాపులకు బిసి రిజర్వేషన్లు ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకుంటానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఈ విషయాన్ని తనకెవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం సభలో కాపులకు బిసి రిజర్వేషన్లు ఇస్తామని తానే ప్రకటించానన్నారు. బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ముద్రగడకు అనుకూల నినాదాలు
జగ్గంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభా వేదికకు సమీపంలో కొందరు కాపు సామాజికవర్గ ప్రతినిధులు ముద్రగడ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ముద్రగడ అనుకూల కాపు కార్యకర్తలు సభా వేదిక వైపు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటుచేసి నిలువరించారు. జగ్గంపేట బస్టాండ్ సమీపంలో కూడా ముద్రగడ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, ముద్రగడను అక్రమంగా గృహనిర్బంధంలో ఉంచారని, తక్షణం రిజర్వేషన్లు ప్రకటించాలంటూ కాపు ప్రతినిధులు నినాదాలు చేశారు.