ఆంధ్రప్రదేశ్‌

‘వంశధార’ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం: శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ నిర్మాణం గట్టుకు సంబంధించి సేకరిస్తున్న మట్టి తవ్వకాలను మంగళవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిరమండలం మండలంలోని తులగాం పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మట్టి సేకరణకు వచ్చిన యంత్రాలను నిర్వాసితులు అడ్డగించారు. దీంతో పనులను నిలిపివేసి యంత్రాలను వెనక్కి తరలించారు. అయితే పోలీస్ బలగాలను మాత్రం కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తులగాం గెడ్డ వద్ద మట్టి సేకరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ బలగాలతో పనులను చేపట్టే విధంగా రెవెన్యూ, వంశధార ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించి యంత్రాలను తరలించారు. పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య, తహశీల్దార్ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడానికి సమాయత్తమయ్యారు. మట్టి సేకరణ సమాచారంతో తులగాం గ్రామానికి చెందిన నిర్వాసితులు పనులు చేపట్టే ప్రాంతానికి భారీగా తరలి వచ్చి పనులను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది.